IND vs PAK: టీవీల్లో కనిపించాలని వస్తారు..! చిరంజీవి, సుకుమార్, నారా లోకేష్‌పై రాయుడు వివాదస్పద వ్యాఖ్యలు
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్ హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. చిరంజీవి, సుకుమార్ వంటి ప్రముఖులు టీవీ ప్రచారం కోసం మ్యాచ్‌కు వచ్చారని అంబటి రాయుడు వ్యాఖ్యానించడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో కాలంగా యావత్ క్రికెట్ ప్రపంచ ఎదురు చూస్తున్న మ్యాచ్ నిన్న(ఫిబ్రవరి 23, ఆదివారం) ముగిసింది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది వేయి కళ్లతో ఎదురుచూశారు. టీమిండియా ఫ్యాన్స్ అంతా ఇండియా గెలవాలని కోరుకున్నారు. వాళ్లు అనుకున్నట్లే.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించింది. సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక మెగా ఈవెంట్లో ఈ రెండు టీమ్స్ తలపడుతున్నాయ్ అంటే కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. చాలా మంది స్టేడియానికి వెళ్లి లైవ్‌లో ఆ మ్యాచ్‌ను ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు.
సాధారణ ప్రేక్షకులే కాదు సెలబ్రెటీలు కూడా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆసక్తి చూపిస్తారు. అలానే ఆదివారం జరిగిన మ్యాచ్ కూడా చాలా మంది సెలబ్రెటీలే వచ్చారు. అందులో ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. స్టేడియంలో వారిని చూసి చాలా మంది తెలుగు వాళ్లు షాక్ అయ్యారు. అయితే.. సెలబ్రెటీలు క్రికెట్ మ్యాచ్‌కు రావడంతో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. “ఇలాంటి మ్యాచ్‌లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్’ అందుకే వస్తారంటూ చాలా చీప్ కామెంట్స్ చేశాడు. అది కూడా సుకుమార్, చిరంజీవి గురించి తెలుగు కామెంటర్లు మాట్లాడుతున్న సమయంలో రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. వీటిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మన దేశం తరఫున ఓ టీమ్ ఆడుతున్నప్పుడు, ఆటపై ఇష్టంతో సపోర్ట్ చేయయడానికి వేల రూపాయలు ఖర్చుపెట్టుకొని స్టేడియానికి వచ్చిన వారిని ఈ రకంగా అవమానిస్తావా అంటూ నెటిజన్లు రాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ గొప్పదే కాదని ఎవరూ అనరు కానీ చిరంజీవి, సుకుమార్ టీవీల్లో కొత్త ఇప్పుడే కనిపిస్తున్నారా? వాళ్ల గురించి ఎవరికీ తెలియదా? పాన్ ఇండియా డైరెక్టర్‌గా సుకుమార్ గురించి దేశమంతా తెలుసు.. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంక్రాంతి సంబురాల్లో పాల్గొనే రేంజ్ ఆయనది. భారత దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషన్ అవార్డు గ్రహీత చిరంజీవి. అలాంటి వాళ్లు ఎంతో ఇష్టంగా, ఆటపై తమకున్న ప్యాషన్‌తో మ్యాచ్ చూసేందుకు వస్తే.. టీవీల్లో కనిపించేందుకు వచ్చారని అంటావా? ఎందుకింత అహంకారం అంటూ రాయుడిని తిట్టిపోస్తున్నారు. వాళ్లు పబ్లిసిటీ కోసం రావడం కాదు.. నువ్వే అటెన్షన్ కోసం ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తున్నట్లు ఉన్నావ్ అంటూ మండిపడుతున్నారు.
Ambati Rayudu about Nara Lokesh and Chiranjeevi 🤭 pic.twitter.com/MepWvuOjbj
— Jagan Squad (@JaganSquad2029) February 23, 2025
#AmbatiRayudu’s controversial statement on the film fraternity , says
Actors will attend #INDvsPAK matches just to watch them on screens, driven by the unmatched craze for these games—that’s the power of cricket! #ChampionsTrophy | #ViratKohli | #IndianCricketTeam pic.twitter.com/VUA2C7aWCt
— TollywoodRulz (@TollywoodRulz) February 23, 2025
View this post on Instagram
View this post on Instagram