IND vs PAK: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా స్టార్! ఔట్ అవ్వాలని మొక్కిన అభిమానులు
భారత జట్టు పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. కోహ్లీ సెంచరీ చేయడానికి 15 పరుగులు దూరంలో ఉన్నప్పుడు, శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో హార్దిక్ పాండ్యా వచ్చాడు. పాండ్యా బౌండరీ కొట్టడంతో కోహ్లీ సెంచరీ సంశయంలో పడింది. అయితే, పాండ్యా తర్వాత అవుట్ అవ్వడంతో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. మ్యాచ్ చివరి 10 నిమిషాలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా సూపర్ డూపర్ విక్టరీ సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వార్ వన్‌సైడ్ చేసేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓటమితో కాస్త కంగారు కలిగినా.. పాకిస్థాన్‌ను పూర్తిగా డామినేట్‌చేసింది. తొలుత అద్భుత బౌలింగ్‌తో పాక్‌ను 241 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా, తర్వాత ఛేజ్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆ టార్గెట్‌ను సింపుల్‌గా దాటేసింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. సరైన ఫామ్‌లో లేడు ఎలాగా అని ఆలోచిస్తున్న తరుణంలో పెద్ద మ్యాచ్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తనని ఎందుకు ఛేజ్ మాస్టర్ అంటారో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకుంటాడా లేదా అని క్రికెట్ అభిమానులంతా ఎంతో కంగారు పడ్డారు.
ఎందుకంటే మ్యాచ్ గెలుపు కోసం కావాల్సిన పరుగులు తగ్గిపోతున్నాయి కానీ కోహ్లీ వేగంగా ఆడి తన సెంచరీ దిశగా సాగాట్లేదు. అయితే అదే టైమ్‌లో శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో క్రీజ్‌లోకి హార్ధిక్ పాండ్యా వచ్చాడు. అంతే ఒక్కసారిగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గుండెలు జారిపోయాయి. హా.. ఇక కోహ్లీ సెంచరీ అయినట్లే అని నిట్టూర్చారు. ఎందుకంటే హార్ధిక్ పాండ్యాపై ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఎవరైనా హాఫ్ సెంచరీ, సెంచరీకి దగ్గరగా ఉంటే వాళ్లను అవీ కంప్లీట్ చేసుకోనివ్వకుండా.. కావాల్సిన రన్స్‌ను ఫోర్లు, సిక్సులతో తనే పూర్తి చేస్తాడని, గతంలో తిలక్ వర్మ అలాగే మరికొంత మంది ప్లేయర్ల విషయంలో అతను చేసిన పని గుర్తొచ్చి కోహ్లీ ఫ్యాన్స్ భయపడ్డారు. ఇన్నింగ్స్ 39వ ఓవర్ 5వ బంతికి అయ్యర్ అవుట్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన పాండ్యా ఆ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసుకున్నాడు.
అప్పటికి టీమిండియా విజయానికి 26 రన్స్ మాత్రమే కావాలి. విరాట్ సెంచరీ పూర్తి చేసుకోవాలంటే 15 రన్స్ దూరంలో ఉన్నాడు. సింగిల్ తీసుకొని కోహ్లీకి స్ట్రైక్ ఇస్తే అతను సెంచరీ పూర్తి చేసుకుంటాడని అంతా భావించారు.. కానీ, పాండ్యాపై కోహ్లీ ఫ్యాన్స్‌కు ఉన్న భయం నిజం చేస్తూ.. షాహీన్ అఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ తొలి బంతికే ముందుకొచ్చి ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బౌండరీ కొట్టాడు. ఆ నెక్ట్స్ బాల్‌కి రెండు రన్స్ కొట్టాడు. దాంతో భారత విజయానికి 20 రన్స్ మాత్రమే కావాలి.. కానీ, కోహ్లీకి 15 రన్స్ అవసరం.
కోహ్లీ ఫ్యాన్స్ కు పాండ్యాపై కోపం పీకలదాకా వచ్చేసింది. అదృష్టవశాత్తు నెక్ట్స్ బాల్‌కి పాండ్యా అవుట్ అయ్యాడు. హమ్మయ్యా అంటూ అంతా ఊపిర పీల్చుకున్నారు. ఫస్ట్ టైమ్ ఓ టీమిండియా బ్యాటర్ అవుట్ అయితే భారత క్రికెట్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ మంచి సపోర్ట్ ఇవ్వడంతో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ కంటే కూడా కోహ్లీ సెంచరీ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివర్లలో 10 నిమిషాలు మాత్రం సినిమాను మించిన డ్రామా సాగింది.
Virat Kohli fans to Hardik Pandya: pic.twitter.com/4pODNZx8sx
— Incognito (@Incognito_qfs) February 23, 2025
Virat Kohli fans when they saw Hardik Pandya:
Walking in Walking out pic.twitter.com/37DtL6OcxX
— Incognito (@Incognito_qfs) February 23, 2025
Hardik Pandya when Virat Kohli scores a century pic.twitter.com/L4b5Q9tZwH
— Sagar (@sagarcasm) February 23, 2025
Didn't understand what Hardik Pandya was thinking.
Looks like he has only one mission to spoil his teammates milestones, luckily today Virat Kohli was not the victim.🥶 pic.twitter.com/L9T6XV5nWm
— Sujeet Suman (@sujeetsuman1991) February 23, 2025
Me secretly thanking god for dismissing Hardik Pandya so that Virat Kohli saab can complete his century:#INDvsPAK #ViratKohli𓃵 pic.twitter.com/rW0dDF93fZ
— Cryptvam 🤞 (@HelloX07) February 23, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
