Babar Azam Plan Against Virat Kohli: టీ20 ప్రపంచ కప్ 2024 ఈసారి USA, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈసారి కూడా జూన్ 9న జరగనున్న టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే గ్రేట్ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ పరుగులు చేయకుండా నిరోధించేందుకు పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయడం ప్రారంభించాడంట. ఈ మేరకు కోహ్లీ బ్యాటింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్‌పై కింగ్ కోహ్లీ ఊచకోత కోస్తుంటాడు. అనుభవజ్ఞుడైన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ పాకిస్థాన్‌తో 10 మ్యాచ్‌లలో 81.33 సగటుతో 488 పరుగులు చేశాడు.
పాక్ జట్టు మంగళవారం ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరనుంది. మే 10 నుంచి ఇరు దేశాల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. పర్యటనకు బయలుదేరే ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబర్ ఆజం టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా ఏదైనా వ్యూహరచన చేస్తారా? అనే ప్రశ్న అడిగారు. అయితే దీనిపై పాక్ కెప్టెన్ స్పందిస్తూ.. ‘ఒక జట్టుగా వివిధ జట్లకు వ్యతిరేకంగా, వారి బలాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. మేం కేవలం ఒక ఆటగాడికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించం. మేం మొత్తం 11 మంది ఆటగాళ్ల కోసం ప్లాన్ చేస్తాం. న్యూయార్క్‌లోని పరిస్థితుల గురించి మాకు పెద్దగా తెలియదు. తదనుగుణంగా ప్లాన్ చేస్తాం. అతను (విరాట్ కోహ్లీ) అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. మేం అతనిపై కూడా ప్లాన్ చేస్తాం’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
2022లో ఆస్ట్రేలియాలో జరిగిన T20 ప్రపంచకప్‌లో, విరాట్ కోహ్లీ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌పై 82* పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టును 4 వికెట్ల తేడాతో గెలిపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్ తన క్రికెట్ కెరీర్‌లో మరపురాని ఇన్నింగ్స్‌గా కోహ్లీ అభివర్ణించాడు.
టీ20 ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్‌ని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ప్రధాన కోచ్‌గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించడం గమనార్హం. కిర్‌స్టెన్‌కు ఈ బాధ్యత అప్పగించినందుకు బాబర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన అనుభవం నుంచి జట్టు ప్రయోజనం పొందుతుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..