Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AFG VS IRE: క్రికెట్‌లో ఆసక్తికర పరిణామం.. ఒకే జట్టులో మామా- అల్లుళ్లు.. ఓపెనర్లుగా బరిలోకి

ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓపెనర్లుగా ఇబ్రహీం జద్రాన్, నూర్‌ అలీ జద్రాన్ క్రీజులోకి వచ్చారు. వీరిద్దరూ మామా ఆల్లుళ్లు కావడం ఇక్కడ విశేషం. ఇటీవల ఇబ్రహీం జద్రాన్ తన టీ20 కెప్టెన్సీలో మామ నూర్ అలీకి అరంగేట్రం క్యాప్‌ను అందించి జట్టులోకి ఆహ్వానించాడు. ఇప్పుడు మామతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు

AFG VS IRE:  క్రికెట్‌లో ఆసక్తికర పరిణామం.. ఒకే జట్టులో మామా- అల్లుళ్లు.. ఓపెనర్లుగా బరిలోకి
Afghanistan Cricket Team
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2024 | 2:37 PM

అబుదాబి వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓపెనర్లుగా ఇబ్రహీం జద్రాన్, నూర్‌ అలీ జద్రాన్ క్రీజులోకి వచ్చారు. వీరిద్దరూ మామా ఆల్లుళ్లు కావడం ఇక్కడ విశేషం. ఇటీవల ఇబ్రహీం జద్రాన్ తన టీ20 కెప్టెన్సీలో మామ నూర్ అలీకి అరంగేట్రం క్యాప్‌ను అందించి జట్టులోకి ఆహ్వానించాడు. ఇప్పుడు మామతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే అబుదాబి టెస్టులో మామ-మేనల్లుడి జోడీ ఫ్లాప్ అయింది. 7వ ఓవర్‌లోనే ఈ జోడీ బ్రేక్ విరిగింది. నూర్ అలీ జద్రాన్ 7వ ఓవర్ మూడో బంతికి ఔటయ్యాడు. మార్క్ అడైర్ బౌలింగ్ లో బల్బిర్నీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. నూర్ జద్రాన్ 27 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే ఓవర్లో అఫ్గానిస్థాన్‌కు మరో దెబ్బ తగిలింది. రహ్మత్ షా ఖాతా కూడా తెరవలేకపోయాడు మరియు అతను 3 బంతులు ఆడి అడైర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. నూర్ అలీ జద్రాన్ మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటికీ, ఈ ఆటగాడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది.

నూర్ అలీ 19 మ్యాచ్‌ల్లో 42 కంటే ఎక్కువ సగటుతో 1480 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన తొలి టెస్టులో కూడా నూర్ అలీ జద్రాన్ మొత్తం 78 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌ లో అతను రాణిస్తాడని అంచనా. మరోవైపు అల్లుడు ఇబ్రహీం జద్రాన్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. ఐర్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఇప్పటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కడపటి వార్తలందే సమయానికి అఫ్గనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ 52 పరుగులు, రహ్మనుల్లా గుర్బాజ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మామ విఫలం.. అల్లుడు నిలబడ్డాడు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..