AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: ధనుష్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.? తెలిస్తే ఫ్యాన్ కాలర్ ఎగరేయాల్సిందే..

హీరోగా దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానే కాకుండా సింగర్ గానూ అదరగొట్టేశాడు. అంతేకాదు.. ఇటు దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన ధనుష్.. ఇప్పుడు మూడో సినిమాను తెరకెక్కించారు.

Dhanush: ధనుష్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.? తెలిస్తే ఫ్యాన్ కాలర్ ఎగరేయాల్సిందే..
Dhanush
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2025 | 8:58 AM

Share

స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో. ధనుష్ చాలా వేగంగా సినిమాలు చేస్తుంటాడు. తెలుగు, తమిళ్, హిందీ బాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కుబేర అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుబేర సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.

నటుడిగానే కాదు దర్శకుడిగానూ ధనుష్ దూసుకుపోతున్నారు. రీసెంట్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందు రాయన్ సినిమా కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్ర చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ధనుష్ తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ తన అభిమాన హీరో ఎవరో తెలిపారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడు ధనుష్ గతంలో టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన నటుడి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓ షోలో పాల్గొన్న ధనుష్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ.. నాకు ఎవరింటే ఇష్టమో నేను చెబుతాను, కానీ ఇతర నటుల అభిమానులు నన్ను ద్వేషించనివ్వకండి.. నాకు టాలీవుడ్ సినిమా అంటే ఇష్టం, చాలా మంది హీరోలు నాకు ఇష్టం. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టం అని తెలిపారు ధనుష్. ధనుష్ రాబోయే చిత్రం ఇడ్లీ కడై షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించి, నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు నటి నిత్యా మీనన్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..