AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వేనా తల్లి రోజూ మా ఫోన్‌లో వినిపించేది..! మనం కాల్ చేయగానే వచ్చే అవేర్నెస్ వాయిస్ ఈమెదే

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయ చేసి, మాటలు చెప్పి అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. లక్కీ డ్రా అని, ఆఫర్స్ వచ్చాయి అని బ్యాంక్ లోన్స్ అని ఏవేవో చెప్పి అమాయకపు ప్రజల నుంచి డబ్బులను కాజేస్తున్నారు. వారి నుంచి ప్రజలు అప్రమత్తం అవ్వాలని ప్రభుత్వం జాగ్రత్తలు చెప్తున్నారు. ఫోన్ లోనూ

నువ్వేనా తల్లి రోజూ మా ఫోన్‌లో వినిపించేది..! మనం కాల్ చేయగానే వచ్చే అవేర్నెస్ వాయిస్ ఈమెదే
Social Awareness
Rajeev Rayala
|

Updated on: Mar 28, 2025 | 11:01 AM

Share

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేటుగాళ్లు మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఆఫర్స్ వచ్చాయని, మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, లక్కీ డ్రాలో మనీ గెల్చుకున్నారు అంటూ ఫోన్స్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఎంతజాగ్రత్తగా ఉన్న కూడా సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తూనే ఉన్నారు. వీరి నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహనా కలిపిస్తూ.. ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య ఫోన్ లోనూ ప్రజలకు జాగ్రత్త చెప్తూ అవగాహనా కలిపిస్తున్నారు. ఫోన్ లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ అవేర్నెస్ ఇస్తున్నారు.

ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా సోషల్ మీడియా లేదా .. తెలియని గ్రూపుల నుంచి పెట్టుబడి చిట్కాలు.. అంటూ ఓ లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ మనకు అవగాహనా కలిపించడం కోసం  ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ.. ప్రతిసారి ఫోన్  చేయగానే ఇదే వాయిస్ వినిపించడంతో కొంతమంది తిట్టుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఇంతకూ ఆ వాయిస్ ఎవరిదో తెలుసా.? ఆమె వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. ఆమె ఎవరంటే.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజు మన ఫోన్ లో వినిపించే వాయిస్ ఈ అమ్మాయిదే.. ఆమె పేరు అమృత. రేడియో మిర్చీలో జాకీగా చేస్తుంది. ప్రతిరోజు తన వాయిస్ తో ఎంతోమందిని అలరిస్తూ ఉంటుంది అమృత. ఇక ఇప్పుడు ప్రతిరోజు మన ఫోన్ లో వినిపిస్తుంది. తాజాగా అమృత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. “సోషల్ మీడియా లేదా .. తెలియని గ్రూపుల నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావొచ్చు.. ఫ్రెండ్స్  నా వాయిస్ కు నేనే ఇరిటేట్ అవుతున్నాను. మొన్నటి వరకు మా అమ్మ నాన్న కూడా ఇది మా అమ్మాయి వాయిస్ అని సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఏంటి ఈ గోల మాకు అంటున్నారు. కానీ ఏం చేస్తాం నా చేతిలో ఏం లేదు” అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్