AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. 48 పరుగులు.. తుఫాన్ సెంచరీతో రుతురాజ్ రికార్డును సమం చేసిన డేంజరస్ ప్లేయర్..

కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో పదో మ్యాచ్‌లో షాహీన్ హంటర్స్ వర్సెస్ అబాసిన్ డిఫెండర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో షాహీన్ హంటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ సెడిఖుల్లా అటల్ ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదాడు. గతంలో విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న ఒకే ఓవర్‌లో 7 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. జట్టులో దూకుడుగా బ్యాటింగ్ చేసిన సెడికుల్లా అటల్ సెంచరీతో రాణించాడు. ఒకవైపు జట్టు వికెట్లు వరుసగా పడిపోతున్నా..

Video: ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. 48 పరుగులు.. తుఫాన్ సెంచరీతో రుతురాజ్ రికార్డును సమం చేసిన డేంజరస్ ప్లేయర్..
Sediqullah Atal
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 31, 2023 | 8:34 AM

Share

క్రికెట్‌లో రికార్డులు శాశ్వతం కావని తెలిసిందే. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డులు కూడా క్షణికావేశంలో తుడిచిపెట్టుకుపోతుంటాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి రికార్డు క్రియేట్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో పదో మ్యాచ్‌లో షాహీన్ హంటర్స్ వర్సెస్ అబాసిన్ డిఫెండర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో షాహీన్ హంటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్ సెడిఖుల్లా అటల్ ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాదాడు. గతంలో విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న ఒకే ఓవర్‌లో 7 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు.

జట్టులో దూకుడుగా బ్యాటింగ్ చేసిన సెడికుల్లా అటల్ సెంచరీతో రాణించాడు. ఒకవైపు జట్టు వికెట్లు వరుసగా పడిపోతున్నా.. క్రీజులో పాతుకుపోయిన అటల్.. చివరి బంతి వరకు మైదానంలో నిలదొక్కుకున్నాడు. అతను కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో అజేయంగా 118 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో తుఫాన్ బ్యాటింగ్ చేసిన అటల్ ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదాడు.

ఇవి కూడా చదవండి

19వ ఓవర్లో సిక్సర్ల వర్షం..

అబాసిన్ డిఫెండర్స్ తరపున 19వ ఓవర్ వేసిన అమీర్ జజాయ్ కేవలం 6 బంతుల్లో 48 పరుగులు ఇచ్చాడు. 19వ ఓవర్ తొలి బంతిని జజయ్ నో బాల్ చేశాడు. ఈ బంతికి అటల్ సిక్సర్ కొట్టాడు. తర్వాత రెండో బంతి వైడ్‌గా వెళ్లి బౌండరీ దాటింది. ఆ తర్వాత తాను వేసిన ప్రతి బంతిలోనూ సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 48 పరుగులు వచ్చాయి.

గైక్వాడ్ రికార్డును సమం చేసిన సెడికుల్లా..

ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాది రుతురాజ్ గైక్వాడ్ రికార్డును సెడికుల్లా అటల్ సమం చేశాడు. గత విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 7 సిక్సర్లు బాదాడు.

92 పరుగులతో విజయం..

అటల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో షాహీన్ హంటర్స్ 214 పరుగులు చేసింది. దీంతో 215 పరుగుల టార్గెట్ విధించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన అబాసిన్ డిఫెండర్స్ జట్టు కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో హంటర్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. హంటర్స్ తరపున సయీద్ ఖాన్, జహిదుల్లా చెరో మూడు వికెట్లు తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..