Viral: నటితో టీమిండియా ఫ్యూచర్ స్టార్ పెళ్లి? సోషల్ మీడియాను కుదిపేస్తోన్న న్యూస్.. బాంబ్ పేల్చిన బ్యూటీ..

Ridhima Pandit To Marry Shubman Gill: టీవీ నటి రిధిమా పండిట్, టీం ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వార్తను ఎవరు మొదట లీక్ చేశారో తెలియదు. అయితే, దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరి వివాహం డిసెంబర్ 2024లో జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు.

Viral: నటితో టీమిండియా ఫ్యూచర్ స్టార్ పెళ్లి? సోషల్ మీడియాను కుదిపేస్తోన్న న్యూస్.. బాంబ్ పేల్చిన బ్యూటీ..
Gill And Ridhima Pandit

Updated on: Jun 01, 2024 | 12:11 PM

Ridhima Pandit To Marry Shubman Gill: టీవీ నటి రిధిమా పండిట్, టీం ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వార్తను ఎవరు మొదట లీక్ చేశారో తెలియదు. అయితే, దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరి వివాహం డిసెంబర్ 2024లో జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరంగా వీరిద్దరి మధ్య వయసు గ్యాప్ 9 ఏళ్లు ఉంది. రిధిమాకు 33 ఏళ్లు. శుభ్‌మన్‌ వయసు 24 ఏళ్లు. ఈ పెళ్లి రూమర్‌పై రిధిమా స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఇందులో వాస్తవం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.

రిధిమా రంగుల ప్రపంచంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయింది. ‘బహు హమారీ’లో తొలిసారిగా నటించింది. ఇది 2016లో ప్రసారమైంది. ఆ తర్వాత పలు హిందీ సీరియల్స్‌లో నటించారు. కొన్ని అవార్డులు అందుకుంది. రిధిమాకు 33 ఏళ్లు. ఆమె శుభ్‌మాన్‌ను వివాహం చేసుకోనుందని వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే, ఇది అబద్ధమంటూ తేల్చిపడేసింది.

‘నేను పొద్దున్నే లేచాను. నాకు జర్నలిస్టుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నా పెళ్లి గురించి ఒక ప్రశ్న అడిగారు. ఎప్పుడో ఒకప్పుడు నా జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరిగితే నేను వచ్చి ప్రకటిస్తాను. ఇప్పుడు ప్రచారంలో ఉన్న దాంట్లో నిజం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

రిధిమా పండిట్ క్లారిటీతో శుభమాన్ గిల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం కూడా ఉంది. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు హోటల్‌లో కొన్నిసార్లు కనిపించారు. ఈ కారణంగా వీళ్లు చాలాసార్లు చర్చల్లోకి వచ్చారు. రిధిమాతో వార్తలు బయటికొచ్చాక, శుభమాన్, సారా విడిపోయారా అనే ప్రశ్న వచ్చింది.

శుభ్‌మన్ పేరు ఇలా చర్చనీయాంశం కావడం ఇదే మొదటిసారి కాదు. రష్మిక మందన్నపై నాకు క్రష్ ఉంది’ అని ఆయన చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గిల్ ఆ ప్రకటనను ఖండించారు. నేనెప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇది పెద్ద చర్చనీయాంశమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..