AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajinkya Rahane : రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్.. అసలు టీమ్ లో ఏం జరుగుతోంది?

Ajinkya Rahane : ఐపీఎల్ 2026లో కేకేఆర్ పేలవ ప్రదర్శనపై విమర్శలు రావడంతో కెప్టెన్ అజింక్యా రహానే తీవ్రంగా స్పందించారు. రహానే వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు ఆరోన్ ఫించ్ స్పందిస్తూ అతడిని సముదాయించారు. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాల్సిన సమయంలో ఇలా విమర్శల మీద పడటం సరికాదని ఫించ్ సూచించాడు.

Ajinkya Rahane : రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్.. అసలు టీమ్ లో ఏం జరుగుతోంది?
Ajinkya Rahane
Rakesh
|

Updated on: Apr 07, 2026 | 10:10 AM

Share

Ajinkya Rahane : ఐపీఎల్ 2026 సీజన్ మొదలైందో లేదో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో అప్పుడే సెగలు మొదలయ్యాయి. జట్టు వరుస ఓటములతో సతమతమవుతుంటే, కెప్టెన్ అజింక్యా రహానే విమర్శకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తన స్ట్రైక్ రేట్‌ను ప్రశ్నించే వారిపై రహానే విరుచుకుపడటంతో, మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ రంగంలోకి దిగి అతడిని శాంతపరచాల్సి వచ్చింది. అసలు రహానే ఏమన్నాడు? ఫించ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలైన తర్వాత, రహానే తన స్ట్రైక్ రేట్‌పై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చాడు. “నాపై కావాలనే కొందరు కుట్ర చేస్తున్నారు. 2023 నుండి నాది బెస్ట్ స్ట్రైక్ రేట్. నన్ను విమర్శించే వాళ్లు బహుశా మ్యాచ్‌లు చూడటం లేదేమో లేక నాపై ఏదో అజెండాతో మాట్లాడుతున్నారు. నా సక్సెస్‌ను చూసి వాళ్లు ఈర్ష్య పడుతున్నారు” అని రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక సీనియర్ ప్లేయర్ అయి ఉండి, విమర్శలను స్వీకరించాల్సింది పోయి ఇలా రియాక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

రహానే వ్యాఖ్యలపై అతని మాజీ సహచరుడు ఆరోన్ ఫించ్ స్పందించాడు. “రహానే.. నీపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ కరవాలని చూడకు. నువ్వు చాలా మంచి ఆటగాడివి. నీ దగ్గర టాలెంటెడ్ టీమ్ ఉంది. టీ20లో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. నీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు, అనవసరమైన మాటలతో ఒత్తిడి పెంచుకోవద్దు” అని ఫించ్ హితవు పలికాడు. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాల్సిన సమయంలో ఇలా విమర్శల మీద పడటం సరికాదని ఫించ్ సూచించాడు.

తనది బెస్ట్ స్ట్రైక్ రేట్ అని రహానే చెప్పుకున్నప్పటికీ, గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి. 2023 ఐపీఎల్ నుంచి చూస్తే, స్ట్రైక్ రేట్ జాబితాలో రహానే 88వ స్థానంలో ఉన్నాడు. 42 మ్యాచ్‌ల్లో అతడి స్ట్రైక్ రేట్ 147.78 మాత్రమే. కనీసం 50 బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ 218.70 స్ట్రైక్ రేట్‌తో అగ్రస్థానంలో ఉండగా, రహానే 64వ స్థానంలో ఉన్నాడు. వాస్తవాలు ఇలా ఉండగా, తనది బెస్ట్ స్ట్రైక్ రేట్ అని రహానే వాదించడం విమర్శలకు మరింత ఊతమిస్తోంది.

ఈ సీజన్‌లో కేకేఆర్ ఆరంభం చాలా దారుణంగా ఉంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఆ జట్టు, మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై వాన కారణంగా పాయింట్‌ను పంచుకుంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్ త్వరగానే అవుట్ అయ్యారు. ఒక రకంగా వాన రాకపోతే కేకేఆర్ ఆ మ్యాచ్ కూడా ఓడిపోయే ప్రమాదం ఉండేది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న కేకేఆర్, తన ప్రయాణాన్ని గాడిలో పెట్టాలంటే రహానే తన బ్యాట్‌తోనే విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?