IND vs WI: నేటి నుంచే తొలి టెస్ట్.. 15 రికార్డులపై కన్నేసిన ఆటగాళ్లు.. లిస్టులో ఎవరున్నారంటే?

West Indies vs India, 1st Test: భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నేటి (జూలై 12) నుంచి ప్రారంభం కానుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో మొత్తం 15 రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

IND vs WI: నేటి నుంచే తొలి టెస్ట్.. 15 రికార్డులపై కన్నేసిన ఆటగాళ్లు.. లిస్టులో ఎవరున్నారంటే?
Ind Vs Wi 1st Test Records
Follow us
Venkata Chari

|

Updated on: Jul 12, 2023 | 4:17 PM

West Indies vs India, 1st Test: నేటి (జూలై 12) నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో మొత్తం 15 రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. అంటే కొంతమంది ఆటగాళ్లు రికార్డులకు చేరువలో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో ప్రత్యేక రికార్డుల లిస్టులో ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం..

  1. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా మారడానికి విరాట్ కోహ్లీకి కేవలం 150 పరుగుల దూరంలో ఉన్నాడు.
  2. టెస్టు క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కింగ్ కోహ్లీ 25 పరుగులు చేయాల్సి ఉంది.
  3. వెస్టిండీస్‌కు చెందిన జాషువా డసిల్వా టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేయడానికి 143 పరుగులు చేయాలి.
  4. విదేశీ టెస్టుల్లో 500 బౌండరీలు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి 13 బౌండరీలు అవసరం.
  5. ఇవి కూడా చదవండి
  6. టెస్టు క్రికెట్‌లో 3500 పరుగులు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ (3437) 63 పరుగులు చేయాలి.
  7. 8500 టెస్ట్ క్రికెట్ పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీ (8479) 21 పరుగులు చేయాలి.
  8. టెస్టు క్రికెట్‌లో 100 బౌండరీల లిస్టులో చేరాలంటే జాషువా డసిల్వా (94)కు ఆరు బౌండరీలు అవసరం.
  9. టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసేందుకు శుభ్‌మన్ గిల్ (921)కు 79 పరుగులు కావాలి.
  10. అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు పూర్తి చేసేందుకు రవిచంద్రన్ అశ్విన్ (697)కు మూడు వికెట్లు అవసరం.
  11. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేయడానికి కెమర్ రోచ్ (396)కు నాలుగు వికెట్లు అవసరం.
  12. అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు పూర్తి చేసేందుకు అక్షర్ పటేల్ (145)కు 5 వికెట్లు అవసరం.
  13. టెస్టుల్లో 50 బౌండరీల లిస్టులో చేరాలంటే తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (42)కు ఎనిమిది బౌండరీలు అవసరం.
  14. ఈ మ్యాచ్‌తో విదేశాల్లో 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో అజింక్యా రహానే (49) చేరనున్నాడు.
  15. అంతర్జాతీయ క్రికెట్‌లో 200 క్యాచ్‌లు అందుకోవడానికి రోహిత్ శర్మ (195)కు 5 క్యాచ్‌లు మాత్రమే కావాలి.
  16. వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్‌కు 4 వికెట్లు మాత్రమే కావాలి. కాబట్టి తొలి టెస్టులోనే అశ్విన్ నుంచి గొప్ప రికార్డులు ఆశించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..