Video: ఇంత చెత్త ఫీల్డింగ్‌ను మీ జీవితంలో చూసి ఉండరు..! మరో లగాన్ ప్లేయర్ అనాల్సిందే భయ్యో..
Hilarious Video: సోషల్ మీడియాలో ఓ క్రికెట్ వీడియో సందడి చేస్తోంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఓ ఫీల్డర్‌పై కోపం, మరో పీల్డర్‌పై జాలి వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ ఫీల్డర్ చేసిన భారీ తప్పిదంతో బ్యాటింగ్ జట్టుకు ఉచితార్థంగా ఓ బౌండరీని అందించాడు. ఆ తర్వాత ఇద్దరు ఫీల్డర్లు కలిసి నవ్వుకుంటూ ముందుకు సాగడం ఈ వీడియోలో చూడొచ్చు.

Hilarious Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో సందడి చేస్తూనే ఉంటుంది. ఇక క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఓ క్రికెట్ వీడియో సోషల్ మీడియాలో అలజడి మొదలుపెట్టేసింది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఓ ఫీల్డర్ కష్టపడి బంతిని ఆపితే, మరో ఫీల్డర్ బ్యాటింగ్ జట్టుకు బౌండరీని బహుమతిగా అందించాడు. ఈ వీడియో ఎక్కడి క్రికెట్ మ్యాచ్‌లోనిదో తెలియదు. అయితే, ఈ వీడియోలో ఇద్దరు ఫీల్డర్లను చూస్తే మాత్రం పాపం అనాల్సిందే. ఒక బ్యాటర్ లాంగ్-ఆన్ వైపు బౌండరీ కోసం షాట్ ఆడాడు. ఒక ఫీల్డర్ బంతిని బౌండరీ లైన్ దాటి వెళ్లకుండా ఆపేందుకు పరిగెత్తి, బంతిపై అడుగుపెట్టి బౌండరీ రోప్ దాటకుండా ఆపేశాడు.
అయితే, బంతిని అందుకుని వికెట్ల వైపు విసిరేందుకు మరో ఫీల్డర్ వచ్చాడు. బంతిని అందుకునే క్రమంలో పట్టు కోల్పోయాడు. దీంతో బ్యాటింగ్ జట్టుకు ఉచిత బౌండరీని అందించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This has to be the most painful sight for a fielder who did his best to save the boundary. 😔😭 #CricketTwitter pic.twitter.com/Mh8uEcq3oo
— Godman Chikna (@Madan_Chikna) February 28, 2024
ఇక భారత క్రికెట్ గురించి చెప్పాలంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ శర్మ అండ్ కో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి చిరస్మరణీయమైన సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా వంటి అగ్రశ్రేణి స్టార్లు యాక్షన్‌లో లేకపోయినా.. రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని యువ జట్టు అద్భుతంగా ఆడి, విజయం సాధించింది.
కాగా, ఈ ఇంగ్లండ్ సిరీస్‌లో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు సిరీస్‌లో మెరిసి, ఫ్యూచర్ స్టార్లుగా మారారు. విజయం కోసం 192 పరుగుల ఛేదనలో, భారత్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే, రాంచీలో జరిగిన రెండో సెషన్‌లో శుభ్‌మన్ గిల్ (52), జురెల్ (39) 72 పరుగులతో అజేయంగా నిలిచి, విజయాన్ని అందించారు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో ప్రారంభం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




