మంజ్రేకర్ కామెంటరీపై ఐసీసీకి ఫిర్యాదు?
టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంజ్రేకర్ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని, అతడి కామెంటరీ తప్పుల తడకగా ఉందని ఆస్ట్రేలియాకు చెందిన ఆదిత్య కుమార్ ఐసీసీకి చేసిన ఫిర్యాదులో ఆరోపించాడు. ‘వికెట్ల వెనక ధోనీ మా వాచ్ డాగ్’ అని తన కామెంటరీలో పేర్కొన్నాడని గుర్తు చేశాడు. నిజానికి కామెంటరీలో ‘మా’, ‘మన’ పదాలు వాడకూడదని, ఇది అతడి […]
టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంజ్రేకర్ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని, అతడి కామెంటరీ తప్పుల తడకగా ఉందని ఆస్ట్రేలియాకు చెందిన ఆదిత్య కుమార్ ఐసీసీకి చేసిన ఫిర్యాదులో ఆరోపించాడు. ‘వికెట్ల వెనక ధోనీ మా వాచ్ డాగ్’ అని తన కామెంటరీలో పేర్కొన్నాడని గుర్తు చేశాడు. నిజానికి కామెంటరీలో ‘మా’, ‘మన’ పదాలు వాడకూడదని, ఇది అతడి పక్షపాత ధోరణికి నిదర్శనమని ఆరోపించాడు.
కామెంటరీ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఓ ఒక్క జట్టుకో ఎలా వత్తాసు పలుకుతాడని కుమార్ ప్రశ్నించాడు. అతడి కామెంటరీ పక్షపాతంగా ఉందని, తనకు ఏమాత్రం నచ్చలేదని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఐసీసీకి రాసిన లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
A guy named Aditya actually wrote a letter to ICC Complaining about Sanjay Manjrekar's Commentary … ??? pic.twitter.com/JwqxKBfl2c
— Taimoor Zaman (@taimoorze) June 25, 2019