AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ’70 సెంచరీలు చేయడమంటే.. క్యాండీ క్రష్ ఆడినంత ఈజీ కాదు’.. కోహ్లీకి బాసటగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌పై షోయబ్ అక్తర్ స్పందించాడు. విరాట్ కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

Virat Kohli: '70 సెంచరీలు చేయడమంటే.. క్యాండీ క్రష్ ఆడినంత ఈజీ కాదు'.. కోహ్లీకి బాసటగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్..
Ind Vs Eng Virat Kohli
Venkata Chari
|

Updated on: Jul 16, 2022 | 7:47 PM

Share

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat kohli) ఫామ్‌పై ప్రస్తుతం తీవ్రమైనచర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ చర్చలోకి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) కూడా ఎంట్రీ ఇచ్చాడు. విరాట్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని షోయబ్ అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీని విమర్శకులు, సోషల్ మీడియాకు దూరంగా ఉండమంటూ తన ఆటపై మాత్రమే ఫోకస్ చేయాలని షోయబ్ అభిప్రాయపడ్డాడు. అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, ‘పాకిస్థానీ అయిన నేను విరాట్ కోహ్లీకి మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే 70 సెంచరీలు చేయడమంటే.. క్యాండీ క్రష్ ఆడినంత సులువు కాదు. ఒక గొప్ప ఆటగాడు మాత్రమే ఇన్ని సెంచరీలు చేయగలడు. సాధారణ ఆటగాడు అలా చేయలేడు. ఈ దశ నుంచి విరాట్ కోహ్లి బయటకు రాగానే, అతను భిన్నమైన విరాట్ కోహ్లీగా నిరూపించుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.

అతను ఇంకా మాట్లాడుతూ, ‘కెప్టెన్‌గా మీ పదవీకాలాన్ని మరచిపోవాలి. ముందుకు సాగండి. బ్యాట్స్‌మెన్‌గా మీపై మాత్రమే దృష్టి పెట్టండి. మీరు పరుగులు చేయలేకపోతున్నారా? ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తున్నారా? ఏమి ఇబ్బంది లేదు. ఇవన్నీ మిమ్మల్ని మరింత బలపరుస్తాయి. ఇంకా 30 సెంచరీలు చేయాల్సి ఉంది. నేను మీ కోసం 110ని టార్గెట్‌గా పెట్టుకున్నాను. మీరు ఇంకా యవ్వనంగా ఉన్నారు. చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు’ అంటూ తెలిపాడు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: షోయబ్ అక్తర్

ఇవి కూడా చదవండి

షోయబ్ అక్తర్ మాట్లాడుతూ, ‘వికెట్‌పై నిలబడాలి. అప్పుడే పరుగులు వస్తాయి. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి విమర్శలను మర్చిపోండి’ అంటూ పేర్కొన్నాడు.

పరుగుల కోసం తహతహలాడుతున్న కోహ్లీ మిడిల్ గ్రౌండ్‌లో చాలా తప్పులు చేస్తున్నాడని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘భయపడకు. బౌలర్లు ఒక బలమైన వ్యక్తికి వ్యతిరేకంగా వెళ్తున్నారని, మీరే ఆ వ్యక్తి అని తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓపికపట్టండి’ అంటూ విరాట్ కోహ్లికి బాసటగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..