కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం ఖాయం చేసుకుంది. లాన్ బాల్ ఈవెంట్ లో మహిళల టీం 16-13తో న్యూజిలాండ్ టీంను సెమీఫైనల్ లో ఓడించి పతకాన్ని ఖాయం చేసుకుంది. లవ్లీ చౌబే, పింకీ, నయన్మోని సైకియా, రూపా రాణి టిర్కీల చతుష్టయం ప్రస్తుతం స్వర్ణ పతకం కోసం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 22 స్వర్ణాలు సహా 52 పతకాలతో నంబర్‌వన్ స్థానంలో ఉంది.
నాలుగో రోజు కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్‌లో పురుషుల 81కేజీల విభాగంలో ఫైనల్స్‌లో పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం క్లీన్ అండ్ జెర్క్ పోటీలు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి చెందిన అజయ్ సింగ్ క్లీన్ అండ్ జెర్క్‌లో తన మొదటి ప్రయత్నంలో 172 కేజీలను ఎత్తాడు. అంతకుముందు, అతను స్నాచ్‌లో గరిష్టంగా 143 కేజీల బరువును ఎత్తాడు. ఈ విధంగా 315 కేజీల బరువును ఎత్తి పతకాల రేసులో నిలిచాడు. స్నాచ్ తొలి ప్రయత్నంలో 138 కిలోలు, రెండో ప్రయత్నంలో 140 కిలోలు, మూడో ప్రయత్నంలో 143 కిలోలు ఎత్తాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..