బ్రెజిల్‌లో పురుషులతో సమానంగా మహిళా ఫుట్‌బాల్‌ ప్లేయర్లకు వేతనాలు!

మహిళల పట్ల వివక్ష అన్నది అన్ని చోట్లా ఉంది! క్రీడల్లో ఇది విస్పష్టంగా కనిపిస్తుంటుంది.. పురుషులతో సమానంగా తమకూ ప్రైజ్‌మనీ ఉండాలని చాలా కాలంగా క్రీడాకారిణులు పోరాడుతున్నారు.. వింబుల్డన్‌లో ఇచ్చే ప్రైజ్‌మనీపై చాలా కాలంగా డిబేట్‌ నడుస్తోంది.. ఇక క్రికెట్‌లోనూ అంతే! పారితోషికాలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.. ఇలాంటి పొరపాట్లు చేయకూడదని బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ సంఘం నిర్ణయించింది.

బ్రెజిల్‌లో పురుషులతో సమానంగా మహిళా ఫుట్‌బాల్‌ ప్లేయర్లకు వేతనాలు!
Balu

|

Sep 04, 2020 | 1:16 PM

మహిళల పట్ల వివక్ష అన్నది అన్ని చోట్లా ఉంది! క్రీడల్లో ఇది విస్పష్టంగా కనిపిస్తుంటుంది.. పురుషులతో సమానంగా తమకూ ప్రైజ్‌మనీ ఉండాలని చాలా కాలంగా క్రీడాకారిణులు పోరాడుతున్నారు.. వింబుల్డన్‌లో ఇచ్చే ప్రైజ్‌మనీపై చాలా కాలంగా డిబేట్‌ నడుస్తోంది.. ఇక క్రికెట్‌లోనూ అంతే! పారితోషికాలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.. ఇలాంటి పొరపాట్లు చేయకూడదని బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ సంఘం నిర్ణయించింది.. ఇక నుంచి పురుష ఫుట్‌బాల్ ఆటగాళ్లతో పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే మహిళ ఫుట్‌బాల్‌ ప్లేయర్లకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలన్న సంచలన నిర్ణయం తీసుకుంది.. జాతీయ ఫుట్‌బాలర్లందరికీ వేతనాలతో పాటు ప్రైజ్‌మనీ కూడా సమానంగా ఇవ్వనున్నట్లు సీబీఎఫ్‌ అధ్యక్షుడు రోజెరియో కబోల్కో ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయం!

ఈ ఏడాది మార్చి నుంచి జాతీయ పురుషులు, మహిళల ఫుట్‌బాలర్లకు ప్రతీది సమానంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు కబోల్కో.. ఇక నుంచి తమ దగ్గర లింగ వివక్షకు తావులేదున్నారు. పురుషులకు, మహిళలకు సీబీఎఫ్‌ సమాన ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. వరల్డ్‌కప్, ఒలింపిక్స్‌ వంటి టోర్నమెంట్లలో పాల్గొనే జట్లకు కూడా సమానంగా వేతనాలు ఉంటాయని తెలిపాడు. జెండర్‌ వివక్ష ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆస్ట్రేలియా, నార్వే, న్యూజిలాండ్‌ దేశాలు పురుష, మహిళా క్రీడాకారులకు సమాన వేతనాలను ఎప్పట్నుంచో అందజేస్తున్నాయి. ఇప్పుడు ఆయా దేశాల సరసన బ్రెజిల్‌ కూడా చేరింది. 2007లో జరిగిన ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో బ్రెజిల్‌ మహిళల జట్టు ఫైనల్‌కు చేరింది.. 2016లో స్వదేశంలో జరిగిన ఒలింపిక్స్‌లో నాలుగోస్థానంలో నిలిచింది.. సీబీఎఫ్‌ తీసుకున్న నిర్ణయం క్రీడాకారిణులకు కొండంత ఆత్మవిశ్వాసం ఇచ్చింది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu