Asian Games 2023: ఆసియా క్రీడల్లో ‘తెలుగు’ ఆటగాళ్ల సత్తా.. భారత్‌కు పతకాల పంట.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే?

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్‌29) భారత పురుషుల జట్టు షూటింగ్‌లో స్వర్ణం సాధించింది. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్‌ల బృందం భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా, దివ్య, పాలక్‌ బృందం రజత పతకం సాధించింది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో తెలుగు ఆటగాళ్ల సత్తా.. భారత్‌కు పతకాల పంట.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే?
Asian Games 2023

Updated on: Sep 29, 2023 | 11:24 AM

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్‌29) భారత పురుషుల జట్టు షూటింగ్‌లో స్వర్ణం సాధించింది. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలే, అఖిల్ షెరాన్‌ల బృందం భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇషా, దివ్య, పాలక్‌ బృందం రజత పతకం సాధించింది. ఇక వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్ స్వర్ణం, సాధించగా, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు టెన్నిస్‌లో ఇప్పటిరకు భారత్‌కు నిరాశజనక ఫలితాలే వచ్చాయి. అయితే శుక్రవారం వీటికి చెక్‌ పెడుతూ డబుల్స్‌ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. డబుల్స్‌ విభాగంలో తెలుగు కుర్రాడు సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సిల్వర్‌ గెల్చుకుంది. రామ్‌కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి మెడల్‌ కాగా.. సాకేత్‌కి ఇది మూడోది కావడం విశేషం. ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 30కి చేరింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది.కాగా ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 27 పతకాలను గెలుచుకుంది. వీటిలో ఏడు బంగారు పతకాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈరోజు క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించే మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌పై అందరి దృష్టి ఉంటుంది. ఆమె గెలిస్తే భారత్‌ కు మరో పతకం ఖాయం అవుతుంది. ఇక బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లు కూడా పతకాలు సాధించే అవకాశం ఉంది.

సంచలనాలు సృష్టిస్తోన్న హైదరాబాద్‌ అమ్మాయి..

ఏషియన్‌ గేమ్స్‌లో హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌ సంచలనాలు సృష్టిస్తోంది. బుధవారం ఒక స్వర్ణం, రజతం సాధించిన ఆమె శుక్రవారం మరో 2 రజత పతకాలను ఖాతాలో వేసుకుంది. దీంతో ఆసియా క్రీడల చరిత్రలో నాలుగు మెడల్స్‌ సాధించిన తొలి క్రీడాకారిణిగా ఇషా రికార్డు నెలకొల్పింది. 25 మీటర్ల పిస్టల్‌ టీమ్, 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగాల్లో ఇషా సింగ్‌ పతకాలు గెల్చుకుంది. దీంతో ఈ హైదరాబాదీ షూటర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

సాకేత్ కు రజతం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..