Wealth Creation: సంపద సృష్టించడం ఎలా..? ధనవంతులు కావడానికి సూత్రాన్ని తెలుసుకోండి

How To Generate Income: ధనవంతులు కావాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకే మనిషి పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తాడు. ఎక్కువ డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, రియల్ ఎస్టేట్..

Wealth Creation: సంపద సృష్టించడం ఎలా..? ధనవంతులు కావడానికి సూత్రాన్ని తెలుసుకోండి
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2022 | 3:16 PM

How To Generate Income: ధనవంతులు కావాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకే మనిషి పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తాడు. ఎక్కువ డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, రియల్ ఎస్టేట్, కార్లు, బంగ్లాలు ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ఇవన్ని ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే డబ్బు సంపాదించడం ముఖ్యం కాంటే సంపాదించేందుకు ఎలా స్టార్ట్‌ చేయాలనే విషయాలను ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. ఇక్కడ సంపాదన ముఖ్యం కాదు.. కానీ సంపాదించేందుకు మార్గాలను ఎలా అనుసరించాలనేది ముఖ్యం. డబ్బును సంపాదించాలంటే ముందుగా ఎలా స్టార్ట్‌ చేయాలనే విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి ఒక్కరు సంపద సృష్టించడానికి అనేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వారు అనుకున్న కల నెరవేరుతుంది. అయితే ఈ రోజుల్లో డబ్బు సంపాదించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. పొదుపు పథకాలు, బిజినెస్‌ పరంగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం, డిమ్యాట్‌ అకౌంట్‌ ద్వారా డబ్బును సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు.

సంపదను సృష్టించడం అంటే ఏమిటి?

తగినంత డబ్బు సంపాదించడం ద్వారా సంపద సృష్టించబడదు. దీని కోసం మీరు మీ పొదుపులను సాధారణ ఆదాయాన్ని పొందే విధంగా పెట్టుబడి పెట్టాలి. అంటే ఎక్కువ డబ్బును ఆకర్షిస్తుంది. మీ పొదుపులను మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే విధంగా కాలక్రమేణా వృద్ధి చెందేలా పెట్టుబడి పెట్టడాన్ని సంపద సృష్టి అంటారు. ఆర్థిక లక్ష్యం అంటే మీకు ఏ సమయంలో ఎంత డబ్బు అవసరమవుతుంది వంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. తగినంత సంపద సృష్టికి, సరైన పెట్టుబడిని ఎంచుకోవడం సరిపోదు. కానీ పెట్టుబడిని పెంచడానికి తగినంత సమయం ఇవ్వడం కూడా ముఖ్యం. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినట్లయితే ప్రయోజనాలు పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే అంత ఎక్కువ లాభం పొందుతారు. అలాగే అధిక రాబడి అంటే అధిక నష్టాలను కూడా సూచిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు ఏదైనా ఆర్థిక ఉత్పత్తి నష్టాలను తెలుసుకోండి. అలా చేయడం ద్వారా మీ డబ్బు సంపాదనలో ఓ అవగాహన వస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

సంపద సృష్టి ఎందుకు ముఖ్యం?

సంపద సృష్టి అనేక విధాలుగా ముఖ్యమైనది. ఇది మీ భవిష్యత్తు లక్ష్యాలను సాధించవచ్చు. అంటే భవిష్యత్తులో మీ అవసరాలను నెరవేర్చుకోవడానికి మీకు డబ్బును అందిస్తుంది. ఉదాహరణకు ఇల్లు కొనడం, పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు మొదలైనవి. ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర నష్టాలు సంభవించినప్పుడు ఇది సాధారణ ఆదాయాన్ని అందించడంలో మీకు సహాయపడుతుంది. లిక్విడిటీని నిర్ధారించుకోవడానికి, మెరుగైన జీవితాన్ని గడపడానికి ఇది మంచి మార్గం. పదవీ విరమణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ఒక దశ. ఈ సందర్భంలో వైద్య ఖర్చులు పెరుగుతాయి. రోజువారీ ఖర్చులకు రెగ్యులర్ ఆదాయం అవసరం. ఏది ఏమైనప్పటికీ సంపద సృష్టితో మీరు ఎప్పటికీ డబ్బు కొరతను ఎదుర్కోలేరు. అలాగే మీరు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా హాయిగా జీవించవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సంపదను ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి 5paisa.com కి వెళ్లండి. ఇక్కడ అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్‌లు మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయం చేస్తారు. డబ్బు సంపాదించడంలో ఎలాంటి పద్దతులను అనుసరించాలనే విషయాలను తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి