ఇకపై వారందరికీ ప్రయోజనమే.. అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపిన బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్..

హెల్త్‌కేర్ నైపుణ్యాలను పెంపొందించేందుకు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్.. అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపింది.. ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BROEC) అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది.

ఇకపై వారందరికీ ప్రయోజనమే.. అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపిన బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్..
Apollo Broec
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 28, 2024 | 12:48 PM

హెల్త్‌కేర్ నైపుణ్యాలను పెంపొందించేందుకు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్.. అపోలో మెడ్‌స్కిల్స్‌తో చేతులు కలిపింది.. ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (BROEC) అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఆరోగ్య సంరక్షణ నైపుణ్యం వ్యవస్థను మెరుగుపరచడానికి అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ Ltd ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటిగా ఉంది. ఈ క్రమంలో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్, అపోలో మెడ్‌స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆగస్టు 25న వ్యూహాత్మక అకడమిక్ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది..

ఈ మేరకు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సీఈఓ, ఫౌండర్ పబ్బా సంతోష్, అపోలో మెడ్‌స్కిల్స్ సీఈఓ డా. శ్రీనివాస్ ఈ ఎంఓయు (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) ను పంచుకున్నారు. ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఇకపై భాగస్వామ్యంతో పనిచేస్తామని ప్రకటించారు.

Broec

విద్య, శిక్షణ, నియామకాల్లో 17 సంవత్సరాల నైపుణ్యంతో, బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ భారతదేశం అంతటా 34 శాఖలను, 11 విదేశాలలో 450 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఉమ్మడి అకడమిక్ రీసెర్చ్, వర్క్‌షాప్‌లు, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, ఇంటర్న్‌షిప్‌లు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్‌ల ద్వారా హెల్త్‌కేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను (BROEC -APOLLO) భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. దీని ద్వారా విద్యార్థులకు, విద్యావేత్తలకు, నిపుణులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది.

భారతీయ ఆరోగ్య సంరక్షణ నిపుణులను అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలకు బహిర్గతం చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ అంచనాలు, డెలివరీల మధ్య అంతరాన్ని తగ్గించడంపై ఈ భాగస్వామ్యం దృష్టి సారించనుంది. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వర్క్‌ఫోర్స్‌కు దోహదపడుతుంది. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, కెరీర్ ప్రోగ్రెస్షన్, అనుబంధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి దీనిని అంకితం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

Broec Apollo