AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ffreedom యాప్‌ను కొనుగోలు చేసిన బాస్‌ వల్లా.. సువిజన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం

Boss Wallah: పెట్టుబడితో బాస్ వల్లా ఒక సమగ్ర వేదికను అందించాలని ఆశిస్తున్నారు. ఇది వేల మంది వ్యవస్థాపకులు నైపుణ్యాలను సంపాదించడానికి, వ్యాపారాన్ని ప్రారంభించడానికి, అభివృద్ధి చేయడానికి అవసరమైన సలహాలను పొందడానికి వీలు కల్పిస్తుంది. ఈ వేదిక మొదట డిజిటల్ వ్యాపారాలు, గృహ ఆధారిత

ffreedom యాప్‌ను కొనుగోలు చేసిన బాస్‌ వల్లా.. సువిజన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం
Subhash Goud
|

Updated on: Feb 27, 2025 | 6:59 PM

Share

పెట్టుబడిదారుడు, సీరియల్ వ్యవస్థాపకుడు శశి రెడ్డి స్థాపించిన సంస్థ బాస్ వల్లా, దాని edtech ప్లాట్‌ఫామ్ ffreedom యాప్‌ను కొనుగోలు చేయడానికి సువిజన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. ffreedom జీవనోపాధి విద్యా కంటెంట్‌తో పాటు, బాస్ వల్లా ప్లాట్‌ఫామ్ ఎక్కువ వ్యాపారాలలో వేలాది మంది నిపుణులకు యాక్సెసబిలిటీ అందిస్తుంది. విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించడానికి టైర్ 2, టైర్ 3 పట్టణాల నుండి

ఆశించే వ్యవస్థాపకులకు రిసోర్స్‌ను అందించడానికి ఇది మార్కెట్‌లో ఉన్న అంతరాన్ని పరిష్కరిస్తుంది.“JEE, ప్రభుత్వ పరీక్షలకు డజన్ల కొద్దీ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. కానీ భారతదేశానికి కావలసింది ఉపాధిని అందించే, ఆదాయాన్ని సంపాదించే వ్యాపారాలను నిర్మించాలనుకునే వ్యక్తులు. బాస్ వల్లా ప్లాట్‌ఫామ్ అదే చేస్తుందని బాస్ వల్లా వ్యవస్థాపకుడు/CEO శశి రెడ్డి తెలిపారు.

సాషి రెడ్డి, అతని సహచరుల నుండి $7 మిలియన్లు (సుమారు రూ. 60 కోట్లు) ప్రారంభ పెట్టుబడితో బాస్ వల్లా ఒక సమగ్ర వేదికను అందించాలని ఆశిస్తున్నారు. ఇది వేల మంది వ్యవస్థాపకులు నైపుణ్యాలను సంపాదించడానికి, వ్యాపారాన్ని ప్రారంభించడానికి, అభివృద్ధి చేయడానికి అవసరమైన సలహాలను పొందడానికి వీలు కల్పిస్తుంది. ఈ వేదిక మొదట డిజిటల్ వ్యాపారాలు, గృహ ఆధారిత వ్యాపారాలు, చిన్న తరహా తయారీ, హస్తకళలు, వ్యవసాయం, పశుసంవర్ధకం, రిటైల్, ఆహార వ్యాపారాలు వంటి డజను వర్గాలపై ఉంది. ఇవి పెద్ద మూలధన పెట్టుబడి లేకుండా నిర్మించగల, ఇద్దరు ముగ్గురుని నియమించడం ద్వారా మెట్రోలకు మకాం మార్చాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న పట్టణంలో గొప్ప ఆదాయాన్ని సంపాదించగల వ్యాపారాలు. అలాగే http://bosswallah.comకు యాక్సెస్ చేయొచ్చు.

సాషి రెడ్డి గురించి చెప్పాలంటే..

సాషి రెడ్డి ఫిలడెల్ఫియాలో ఉన్న ప్రారంభ దశ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన SRI క్యాపిటల్ వ్యవస్థాపకుడు. అలాగే మేనేజింగ్ భాగస్వామి. ఆయన వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్‌కు సలహాదారు కూడా. గతంలో సాషి భారతదేశం, US, UK లలో కార్యకలాపాలను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్వతంత్ర సాఫ్ట్‌వేర్ పరీక్షా సంస్థ అయిన AppLabs వ్యవస్థాపకుడు, CEO. AppLabs కు WestBridge Capital, Sequoia Capital India నిధులు సమకూర్చాయి. ఇప్పుడు AppLabs ను కొనుగోలు చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి