AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 రోజులు, 100 దేశాలు ఒకే కుటుంబంగా ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం.. ఎక్కడంటే…

ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం” మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి, ప్రధానోపన్యాసం అందిస్తూ, సంస్కృతిని ‘‘అనుసంధానం, ఆరాటం, సహకారం, సహజీవనం, సహసృష్టి’’గా అభివర్ణించారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే ఏకత్వం, ప్రేమ, శాంతిని అనుభవించేందుకు ఈ వేడుకల్లో పాల్గొనాలని ప్రపంచాన్ని ఆహ్వానించారు.

100 రోజులు, 100 దేశాలు ఒకే కుటుంబంగా ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం.. ఎక్కడంటే...
World Cultural Festival
Jyothi Gadda
|

Updated on: Aug 17, 2025 | 1:40 PM

Share

ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం 2025 కర్ణాటకలోని సత్య సాయి గ్రామంలో అద్భుతంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA) సహకారంతో ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం మిషన్ ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ మహోత్సవం 100 రోజులపాటు కొనసాగి, 100 దేశాలను ఏకం చేస్తూ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సేవ, మానవత్వాన్ని ఒకే వేదికపై తీసుకురావడం ముఖ్య ఉద్ధేశం. సనాతన సంప్రదాయాల నుండి ఆధునిక కళారూపాల వరకు, ఆధ్యాత్మిక చర్చల నుండి కళా ప్రదర్శనల వరకు – ఈ మహోత్సవం ఒకే సత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. “సరిహద్దులు, విభజనలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని మానవజాతి మొత్తం ఒకే కుటుంబంగా నిలబడగలదన్నది ఈ వేడుక ఉద్ధేశం.”

భారత ప్రభుత్వం తరఫున సాంస్కృతిక మంత్రి, గౌరవనీయ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఈ మహోత్సవంలో పాల్గొనే అన్ని దేశాలకు హృదయపూర్వక స్వాగతం పలికారు. అలాగే, భారత సాంస్కృతిక సంపదను ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను IGNCA ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పద్మభూషణ్, మిషన్ కర్మయోగి భారత్ చైర్‌పర్సన్, కళాక్షేత్ర ఫౌండేషన్ మాజీ చైర్మన్ శ్రీ సుబ్రమణియన్ రామదొరై, ‘‘శ్రద్ధ, భాగస్వామ్యం, దాతృత్వం, సద్భావన, అవగాహన, సహకారం’’ అని ఈ ఉత్సవం సందేశమని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో కర్నాటక రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ టి. బి. జయచంద్ర, ఈ కార్యక్రమాన్ని ప్రపంచ సంస్కృతి పండుగగా మాత్రమే కాకుండా, ప్రేమ, సేవ అనే వారసత్వాన్ని కొనసాగించే ఒక స్ఫూర్తిదాయక ప్రస్థానంగా ప్రశంసించారు. “ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం” మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి, ప్రధానోపన్యాసం అందిస్తూ, సంస్కృతిని ‘‘అనుసంధానం, ఆరాటం, సహకారం, సహజీవనం, సహసృష్టి’’గా అభివర్ణించారు. శతాబ్దానికి ఒకసారి వచ్చే ఏకత్వం, ప్రేమ, శాంతిని అనుభవించేందుకు ఈ వేడుకల్లో పాల్గొనాలని ప్రపంచాన్ని ఆహ్వానించారు.

శ్రీ సత్యసాయి మానవ శ్రేష్ఠత విశ్వవిద్యాలయం (శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్) విద్యార్థులు, సిబ్బంది చేసిన శక్తివంతమైన సాంస్కృతిక ప్రదర్శన ‘‘వందేమాతరం’’తో వేడుకలు ముగిశాయి. తద్వారా రాబోయే 100 రోజుల ఉత్సవానికి వీరు ఒక ఉత్సాహభరిత ఆరంభాన్ని ఇచ్చారు. ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం 2025, భౌగోళిక సరిహద్దులు, మత భేదాలు, సంప్రదాయాలకతీతంగా మానవజాతిని ఏకం చేసే విలువలను ప్రతిబింబిస్తూ, ప్రపంచ సాంస్కృతిక – ఆధ్యాత్మిక మార్పిడిలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..