AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shastra: మీరు ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో లక్ష్మీదేవి కోలువైనట్లే..!

Vastu Shastra: ఏ ఇంట్లోనైనా లేదా దుకాణంలోనైనా ప్రార్థనా స్థలం చాలా ముఖ్యమైన ప్రదేశం. ఈ స్థలం శుభ్రతతో పాటు దాని స్వచ్ఛతను కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. వాస్తు శాస్త్రం నుండి లక్ష్మీదేవికి సంబంధించిన నియమాలను తెలుసుకోండి. ఇంట్లో ప్రతిరోజూ దీపాన్ని..

Vastu Shastra: మీరు ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో లక్ష్మీదేవి కోలువైనట్లే..!
Subhash Goud
|

Updated on: Aug 17, 2025 | 2:04 PM

Share

Vastu Shastra: ప్రతి ఒక్కరు తమ ఇంట్లో లక్ష్మీదేవి నిలువాలని కోరుకుంటారు. అందుకు పూజలు, తగిన నియమాలు పాటించాలి. ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. ఇంట్లో ప్రతిరోజూ దీపాన్ని శుభ్రం చేసిన తర్వాతే వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఆలయం గానీ, ఇంటి పవిత్రత, స్వచ్ఛత చెక్కుచెదరకుండా ఉంటాయి.  మీ ఇంటి ఆలయాన్ని శుభ్రం చేసినప్పుడల్లా పొరపాటున కూడా దేవుని చిత్రపటాన్ని నేలపై ఉంచకూడదు. బదులుగా దేవుని చిత్రాలను శుభ్రమైన ప్రదేశంలో ఒక గుడ్డ పైన ఉంచిదని పండితులు చెబుతున్నారు.

పూజ చేసిన తర్వాత పూజాగది తెరను ఎల్లప్పుడూ కిందకు దించాలి. దీనితో పాటు, పూజ గదిలో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయంటున్నారు. ప్రతిరోజూ మీ ఇల్లు, ఆలయాన్ని శుభ్రం చేసుకోండి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉన్న ఇంట్లో నివసిస్తుందని, మురికిగా ఉన్న ఇంట్లో పేదరికం ప్రబలుతుందని అంటారు. అందుకే పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. దీనితో పాటు మీరు ప్రతిరోజూ మీ ఇంటి గుడిలో దీపం వెలిగించాలి. ఇది లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకువస్తుంది. ఆమె భక్తులతో సంతోషిస్తుంది. ఇంటి శక్తి సానుకూలంగా ఉంటుంది. అలాగే, తులసి మొక్కకు నీరు పెట్టండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఈ మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు.

అదే సమయంలో మీరు దానధర్మాలు కూడా చేయాలి. ఇది మీ జీవితంలో సానుకూలతను కూడా ఉంచుతుంది. మీరు వారానికి ఒకసారి పేదవారికి ఆహారం పెట్టడం లేదా బట్టలు దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీని వల్ల దేవత నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. ప్రతిరోజూ సాత్విక ఆహారం తినడానికి ప్రయత్నించండి. ఇది లక్ష్మీ దేవిని కూడా మీ ఇంటికి వచ్చేలా దోహదపడుతుందంటున్నారు. ఎందుకంటే మాంసాహారం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. మీరు ప్రతిరోజూ లక్ష్మీ దేవి మంత్రాన్ని జపించాలి. ఇది మీ జీవితంలో కూడా మార్పులను తెస్తుంది. శ్రీ సూక్త, లక్ష్మీ చాలీసా లేదా కనకధార స్తోత్రాలను పఠించడం వల్ల ఇంట్లో సంపద, శ్రేయస్సు వస్తుందని పండితులు చెబుతున్నారు.

నోట్ : ఇందులోని అంశాలు మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..