Numerology: ఈ సంఖ్య కలిగిన అమ్మాయిలు సూపర్ స్మార్ట్‌, భర్తలకు వరం..!

Girls with number 8: సంఖ్యా శాస్త్రం ప్రకారం.. మనం పుట్టిన తేదీ కేవలం ఒక తేదీ కాదు.. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మనం పుట్టిన తేదీరోజు మన వ్యక్తిత్వం, జీవితం, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇప్పుడు మనం 8 గురించి తెలుసుకుందాం.

Numerology: ఈ సంఖ్య కలిగిన అమ్మాయిలు సూపర్ స్మార్ట్‌, భర్తలకు వరం..!
Number 8

Updated on: Feb 01, 2026 | 4:31 PM

హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రంలానే సంఖ్యా శాస్త్రం కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది. సంఖ్యా శాస్త్రంలో ప్రతి రాడిక్స్ కు దాని స్వంత ప్రాముఖ్యత, ప్రభావం ఉంటుంది. ప్రతి ర్యాడిక్స్‌కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాంటి ఒక రాడిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంఖ్యా శాస్త్రం ప్రకారం.. మనం పుట్టిన తేదీ కేవలం ఒక తేదీ కాదు.. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మనం పుట్టిన తేదీరోజు మన వ్యక్తిత్వం, జీవితం, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇప్పుడు మనం 8 గురించి తెలుసుకుందాం.

నాయకత్వ లక్షణాలు

సంఖ్యా శాస్త్రంలో 8 సంఖ్య ఉన్న అమ్మాయిలను చాలా ప్రభావంతమైన అమ్మాయిలుగా భావిస్తారు. మీరు ఏదైనా నెలలో 8, 17 లేదా 26వ తేదీలలో జన్మించినట్లయితే.. మీ సంఖ్య 8 అవుతుంది. ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు సహజమైన నాయకత్వ సామర్థ్యాలను, ఆర్థిక అవహగాహన కలిగిఉంటారు.

గొప్ప విజయాలు

8వ సంఖ్యను పాలించే గ్రహం శని. శనిని న్యాయం, కర్మలకు దేవుడిగా పరిగణిస్తారు. అందుకే ఈ సంఖ్యతో జన్మించిన అమ్మాయిలు సహజంగా క్రమశిక్షణ, న్యాయం, కష్టపడి పనిచేసేవారు అయి ఉంటారు. జీవితంలో విజయం వారికి తేలికరాదు. అవిశ్రాంత కృషి, ఆచంచల స్ఫూర్తితో గొప్ప విజయాలను సాధిస్తారు. నిజాయితీ కారణంగా గౌరవించబడతారు.

భాగస్వాములను అదృష్ట వంతులు చేస్తారు

8వ నంబర్ కలిగిన అమ్మాయిలు గొప్ప బలం వారి డబ్బు నిర్వహణగా చెప్పవచ్చు. ఎప్పుడూ ప్రదర్శన కోసం డబ్బు వృధా చేయరు. డబ్బును సద్వినియోగం చేసుకోవడం వారికి తెలుసు. వివాహం తర్వాత తమ భర్తలకు తాము అదృష్టవంతులమని నిరూపించుకుంటారు. ఇంటి బడ్జెట్ నిర్వహణ, ప్రణాలికలు ఖచ్చితంగా ఉంటాయి. డబ్బును ఆదాయం చేయడంలో వీరికి వీరే సాటి.

సూపర్ స్మార్ట్‌

ఈ సంఖ్య గల అమ్మాయిలు బలమైన ఆత్మ విశ్వాసం, మానసిక బలాన్ని కలిగి ఉంటారు. 8వ నెంబర్ అమ్మాయిలు చాలా తెలివైనవారు, వ్యూహాత్మక వ్యక్తులు అయి ఉంటారు. సమస్యలకు భయపడకుండా.. పరిష్కారాలను వెతుక్కుంటారు. ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా వారు బలంగా నిలబడి పరిష్కరించుకుంటారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం సంఖ్యా శాస్త్రం, మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. వీటిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)