AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Sentiment: ఓరి దేవుడో.. నల్ల బట్టలు వేసుకుంటే ఇన్ని అనర్థాలా.. అసలు కారణం ఇదే..

ఎలాగైతే వెలుతురు జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుందో.. చీకటిని అజ్ఞానానికి సంకేతంగా పరిగణిస్తారు. నలుపు రంగు చీకటికి చిహ్నం. అది మాత్రమే కాదు దుఖానికి, నిరసనకి నలుపు రంగు చిహ్నంగా ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భర్త చనిపోయిన మహిళలు తెలుపు రంగు వస్త్రాలకు బదులుగా నలుపు రంగునే ధరిస్తారు. ఇలా ఎప్పటినుంచో నలుపు రంగుపై ఒక వ్యతిరేక భావన ఉంది. మరి నిజంగానే నలుపు రంగు అంత డేంజరా తెలుసుకుందాం..

Black Sentiment: ఓరి దేవుడో.. నల్ల బట్టలు వేసుకుంటే ఇన్ని అనర్థాలా.. అసలు కారణం ఇదే..
Why You Should Avoid Black Clothes
Bhavani
|

Updated on: Mar 05, 2025 | 7:32 PM

Share

కొందరికి నలుపంటే ప్రాణం.. దుస్తుల దగ్గర నుంచి నెయిల్ పాలిష్ వరకు నల్ల రంగునే ఎంచుకుంటారు. ఈ రంగు నలుగురిలో మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. కాస్త బరువు సమస్యలతో బాధపడే వారైతే అకేషన్ ఎలాంటిదైనా నల్ల రంగు దుస్తులనే ఎంచుకుంటారు. ఎందుకంటే నలుపు కాస్త సన్నగా కనిపించేలా చేస్తుంది కాబట్టి. కానీ, నలుపంటే పూర్వీకుల నుంచి ఒక నమ్మకం అనాదిగా వస్తుంది. ఈ రంగు అశుభాన్ని సూచిస్తుందంటారు. అందుకే శుభకార్యాల్లో, ముఖ్యమైన పనులు మొదలు పెట్టేటప్పుడు నలుపును ఒక శత్రువుగా చూస్తుంటారు. ఇలా సమాజంలో రెండు రకాల ధోరణులు కలిగిన వారు ఉన్నారు. కానీ అసలు నలుపు ధరించడం వల్ల నిజంగానే సమస్యలు వస్తాయా.. ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్న వివరణ ఇదే..

చావు ఇంటికి వేసుకెళ్లకండి..

సహజంగానే నలుపు రంగుకు తన చుట్టూ ఉన్న ఎనర్జీని గ్రహించే లక్షణం ఉంటుందట. ఎప్పుడైతే మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీలోనూ ప్రవేశించాలని కోరుకుంటారో అప్పుడు నలుపును ధరించవచ్చు. కానీ, మీరు కొన్ని రకాల పనుల నిమిత్తం వెళ్లినప్పుడు.. అమంగళకర కార్యాలు జరిపినప్పుడు, లేదా చావు ఇంటికి వెళ్లినప్పుడు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని ఇది మీరు కూడా గ్రహించేలా చేస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్న మాట.

నలుపుతో మానసిక సమస్యలు..

మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక సమస్యలే. మానసికంగా ధైర్యంగా ఉన్న వ్యక్తులను ఎంత పెద్ద కష్టమొచ్చినా ఏమీ చేయలేదు. అదే మీరు మనసు పరంగా బలహీనులైతే తాటాకు చప్పుళ్లు కూడా మిమ్మల్ని అదిరిపోయేలా చేస్తాయి. మరి ఈ మానసిక సమస్యలకు అనేక కారణాలున్నప్పటికీ అందులో మనం ధరించే దుస్తుల రంగు కూడా ఒకటి. ఎవరైతే నలుపును తరచుగా వేసుకుంటారో ఆ వ్యక్తులు మానసిక సమస్యలకు గురవుతారని నమ్ముతారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొనే మానసిక సమస్యలలో కనీసం 20% నుండి 25% వరకు నల్ల బట్టలు వేసుకోవడం మూలంగానే అంటే మీరు నమ్ముతారా.. కానీ ఇదే నిజమంటున్నారు ఆధ్యాత్మిక గురువులు.

ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టే..

నలుపును వేసుకుని బయటకు వెళ్లడం అన్ని వేళలా మంచిది కాదంటారు. కొన్నిసార్లు ఇది ప్రమాదాలకు కూడా దారి తీస్తుందంటారు. అందుకే నలుపుని అశుభంగా భావిస్తుంటారు. ఒకవేళ ఈ రంగు బట్టలు వేసుకోవాల్సి వచ్చినప్పటికీ ఎక్కువ సమయం వీటిని ధరించి ఉండకూడదంటారు. నలుపును జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి చిహ్నంగా భావిస్తారు. జాతకంలో శని సరైన స్థానంలో లేప్పుడు శనివారాలు నలుపును పూర్తిగా ధరించకూడదు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే