పాములు ఇంటిలోకి రావడం సహజం. ముఖ్యంగా వేసవి కాలంలో ఉక్కపోత, వేడి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా జనవాసాల్లోకి వస్తుంటాయి.
పాములు
అయితే చాలా మంది ఇంటిలో పిల్లి , లేదా కుక్కను పెంచుకుంటుంటారు. అయితే కొంత మంది ఇంటిలో పిల్లి ఉంటే, పాములు ఇంటిలోనికి రావు అంటారు.
ఇళ్లు
మరి నిజంగానే ఇంట్లో పిల్లి ఉంటే పాములు రావా? ఇందులో నిజం ఎంత ఉంది? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం
పాములు ఎక్కువగా ఆహారం వేటాడే క్రమంలో ఇంటిలోనికి వస్తాయి. కప్పలు, ఎలుకలు కనిపిస్తే ఇంటిలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా ఎలుకలు తమ ఆహారం కాబట్టి వాటి కోసం వస్తాయి.
ఆహారం కోసం
అయితే ఏ ఇంటిలో అయితే పిల్లి ఉంటుందో, ఆ ఇంటిలో ఎలుకలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన పిల్లి ఉన్న ఇంటిలోకి పాములు రావు అంటున్నారు కొందరు.
పిల్లి ఉంటే పాములు రావు
అంతే కాకుండా పిల్లుల తన శబ్ధాలు, కదలికలతో పాములను బయటపెట్టి తరమివేస్తుంటాయి. అవుతన అవి పిల్లులు తిరిగే ప్రదేశాల్లోకి రావు.
శబ్ధాలతో తరిమి కొట్టడం
అందువలన పాములు చాలా వరకు పిల్లులు ఉన్న ఇంటిలోకి వచ్చే అవకాశ చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. పిల్లుల సౌండ్ వినిపిస్తేనే పారిపోతాయంట.
పాములు పారిపోతాయి
అయితే ఇలా అన్ని పాములు ఉంటాయా అంటే? కొన్ని పాములు మాత్రమే పిల్లులకు భయపడతాయి. ముఖ్యంగా నాగు పాములు పిల్లితో పోరాడే సామర్థ్యం ఉంటుంది.
నాగు పాము
అందువలన అత్యధిక విషం ఉన్న పాములు పిల్లులకు భయపడవంట, పిల్లులు ఉన్నాయి కదా, పాములు రావు అని అజాగ్రత్తగా ఉండకూడదని చెబుతున్నారు నిపుణులు.