కేవలం రెండు నిమిషాలే... కల్తీ మామిడి పండ్లను గుర్తించే అద్భుతమైన చిట్కా!

samatha

25 April 2026

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. దీంతో ప్రతి ఒక్కరూ మార్కెట్‌లో రక రకాల మామిడి పండ్లను కొనుగోలు చేసి తింటుంటారు.

మామిడి పండ్ల సీజన్

ప్రతి ఒక్కరికీ మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వీటి రుచి అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సీజన్ మొత్తం ఇష్టంగా తింటారు.

ఇష్టమైన ఫ్రూట్

అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో వచ్చే మామిడిపండ్లలో ఎక్కువగా రసాయనాలు కలుపుతున్నారంటూ, అనేక వార్తలు వస్తున్నాయి. ఇలాంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

కెమికల్స్

అయితే మార్కెట్‌లో రసాయనాలతో పండించిన మామిడిపండ్లను కేవలం రెండు నిమిషాల్లో సులభంగా ఎలా గుర్తించాలి? దీనికి సంబంధించిన చిట్కాలు చూద్దాం.

చిట్కాలు

సహజంగా పండిన మామిడి పండ్లు ఫ్రెష్‌గా పూర్తి పసుపు రంగులో కనిపిస్తాయి. వీటిపై ఎలాంటి మచ్చలు ఉండవు. ఇలాంటి పండ్లు రసాయనాలు లేని పండ్లు.

మచ్చలు ఉండవు

అలాగే ఏ మామిడి పండ్లపై అయితే ఆకు పచ్చ మచ్చలు కనిపిస్తాయో, అవి కెమికల్స్ కలిపి పండించారు అని గుర్తించాలి. వాటిని కొనుగోలు చేయకపోవడమే మంచిది.

మచ్చలు కనిపించడం

అదే విధంగా మామిడి పండ్లను కమికల్ పీల్స్ వేసి పండించడం వలన పండ్లపై తెలుపు రంగు లేదా నీలి రంగు గుర్తులు ఉంటాయి. ఇలాంటివి కనిపిస్తే అవి రసాయనాలు కలిసిన పండ్లు.

తెలుపు, నీలిరంగు మచ్చలు

అదే విధంగా మీరు మామిడి పండును చేతితో తాకిన సమయంలో కొంత భాగం పండుగా, మరికొంత భాగం గట్టిగా ఉంటే, అది కెమికల్స్ కలిసిన పండ్లు అని గుర్తిచాలి.

సరిగ్గా పండకపోవడం