Sri Rama Navami: ఈ ఏడాది శ్రీ రామ నవమి ఎప్పుడు, తేదీ, ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

|

Mar 25, 2023 | 9:00 AM

చైత్ర శుద్ధ నవమి నాడు.. ఇంతటి విశిష్టత కలిగి యున్న చైత్ర మాసం తొమ్మిదో రోజున శ్రీరామ నవమిగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. 

Sri Rama Navami: ఈ ఏడాది శ్రీ రామ నవమి ఎప్పుడు, తేదీ, ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?
Sri Rama Navami
Follow us on

శ్రీరామ నవమి హిందువులకు అతి ముఖ్యమైన పండగల్లో ఒకటి. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. అంతేకాదు.. శ్రీరాముడు సీతాదేవిల కళ్యాణం జరిగింది చైత్ర శుద్ధ నవమి రోజునే.. ఇక శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనది చైత్ర శుద్ధ నవమి నాడు.. ఇంతటి విశిష్టత కలిగి యున్న చైత్ర మాసం తొమ్మిదో రోజున శ్రీరామ నవమిగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు.

హిందూ మతంలోని అన్ని దిగువ, ఉన్నత కులాల వారు జరుపుకునే ఐదు ప్రధాన పవిత్ర పండుగలలో రామ నవమి ఒకటి. అయోధ్య రాజు, దశరథుడు..  కౌసల్య  దంపతుల తనయుడు శ్రీరాముడు. రామ నవమి నాడు, భక్తులు రామాయణం, శ్రీమద్ భాగవతం వంటి పవిత్ర గ్రంధాలను పఠిస్తారు. భూమిపై శ్రీరాముని అవతారానికి గుర్తుగా, ప్రజలు తమ కుటుంబాలు, స్నేహితులతో కలిసి దేవాలయాలలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ ఏడాది శ్రీ రామ నవమి ఎప్పుడు వచ్చిందంటే..

రామ నవమి తేదీ:
ఈ సంవత్సరం శ్రీ రామ నవమి పండుగ గురువారం 30, 2023 రోజున వచ్చింది. అంటే హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో మొదటి నెల అయిన చైత్ర మాసం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ప్రతి సంవత్సరం తేదీలు మారుతూ ఉంటాయి. హిందూ క్యాలెండర్ చైత్ర మాసం ప్రకారం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. అలాగే, ఇది ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్ గ్రెగోరియన్ నెలలతో సమానంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..