Devotional : సామజవరగమన అంటే నేటి తరంలో కొందరికి సినిమా పాటగానే తెలుసు..అసలైన అర్ధం ఏమిటంటే..!

 "సామజవరగమనా" ఈ పదం వినగానే చాలా మందికి అలవైకుంఠ పురంలోని పాటు గుర్తుకొస్తుంది. అదే ముందు తరంవారికైతే త్యాగరాయ కీర్తన గుర్తుకొస్తుంది. ఇక 80లో వారికైతే శారద అంటూ...

Devotional : సామజవరగమన అంటే నేటి తరంలో కొందరికి సినిమా పాటగానే తెలుసు..అసలైన అర్ధం ఏమిటంటే..!
Follow us
Surya Kala

|

Updated on: Feb 28, 2021 | 1:33 PM

Devotional : “సామజవరగమనా” ఈ పదం వినగానే చాలా మందికి అలవైకుంఠ పురంలోని పాటు గుర్తుకొస్తుంది. అదే ముందు తరంవారికైతే త్యాగరాయ కీర్తన గుర్తుకొస్తుంది. ఇక 80లో వారికైతే శారద అంటూ గట్టిగా అరిచే శంకరాభరణం శంకర శాస్త్రిగారు గుర్తుకొస్తారు.. 90 లో అయితే బాలకృష్ణ సామజవరగమనా గుర్తుకొస్తే.. మరికొందరికి “మా మావ పాట” అని తన జ్ఞాపకాలను గుర్తు చేస్కునే కింగ్ సినిమా లోని “స్వరబ్రహ్మ జయసూర్య” బ్రహ్మానందం గుర్తుకొస్తారు.. అయితే అసలు సామజవరగమనా పాటలకు అర్ధం భావం ఏమిటో తెలుసుకుందాం..!

“సామజవరగమనా” త్యాగరాయ కీర్తన :

పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥ అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥ చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ! గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే సామజవరగమన చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది … కానీ చాలా మందికి ” సామజవరగమన ” అంటే ఏంటో తెలీదు..

సామజవరగమన ‘ అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది … ‘ సామజ ‘ అనగా ” ఏనుగు ” అని ..’ వరగమనా ‘ అనగా ” చక్కని నడక ” అని అర్థం … అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! ” సామజవరగమన ” అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..

మరి అసలైన ” సామజవరగమన ” ఎవరంటే..

అసలైన ” సామజవరగమన ..” శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..”. వాల్మీకి తన రామాయణం లో ‘అరణ్యవాసం’లో ఒకచోట రాముడిని “గజవిక్రాంతగమను”డని వర్ణించారు. అంటే రాముడు ఏనుగులా హుందాగా నడిచే వాడు అని అర్ధం.. ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో ‘ సామజవరగమన ‘ అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు.

చాలా మంది ” సామజవరగమన ” అంటూ పాడేస్తున్నారు.. అయితే కొంతమందికి ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు .. దాని అర్థం ఏంటో కూడా తెలీదు.. అటువంటి వారికోసమైనా “సామజవరగమన ” కీర్తన.. దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం..

సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥ సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥ వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ ! గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥

ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది .. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది …

కీర్తన అర్ధం :

ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు.. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి.. సమావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మామ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో.. ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు భావం!

వాగ్గేయకారుడు త్యాగయ్య, శ్రీకృష్ణుడి నడక ని, ఏనుగు నడక తో పోల్చారు. ఏనుగు నడక ని ,మనం గమనిస్తే, ఎంతో గంభీరంగా, నెమ్మది గా నడుస్తుంది. సింహం నడక హింస తో కూడిన అధికారానికి ప్రతీక అయితే, ఏనుగు నడక హింస లేని అధికారానికి ప్రతీక అని పెద్దలు అంటారు.

Also Read:

 చిరంజీవి సురేఖ దంపతుల రేర్ ఫోటో.. చిరు భార్య చేతిలోని చిన్నారి ఎవరో తెలుసా..!

వకీల్ సాబ్’లాంటి సినిమా రావడం ముఖ్యం.. పవన్ కళ్యాణ్ లాంటివారు చేయడం మరీ ముఖ్యం..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ