Chiranjeevi Rare Photo: చిరంజీవి సురేఖ దంపతుల రేర్ ఫోటో.. చిరు భార్య చేతిలోని చిన్నారి ఎవరో తెలుసా..!

ఒక సామాన్య కుటుంబంలో పుట్టి.. సినిమాలపై ఇష్టంతో స్వయంకృషితో హీరోగా ఎదిగి..  తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు కొణిదెల శివశంకర వరప్రసాద్..

Chiranjeevi Rare Photo: చిరంజీవి సురేఖ దంపతుల రేర్ ఫోటో..  చిరు భార్య చేతిలోని చిన్నారి ఎవరో తెలుసా..!
Surya Kala

|

Feb 28, 2021 | 5:56 PM

Chiranjeevi Rare Photo:  ఒక సామాన్య కుటుంబంలో పుట్టి.. సినిమాలపై ఇష్టంతో స్వయంకృషితో హీరోగా ఎదిగి..  తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు కొణిదెల శివశంకర వరప్రసాద్.. అలియాస్.. చిరంజీవి.  సామాన్యుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టి మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శం.. కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రారాజుగా వెలుగొందిన ఆయన సినీ సెలబ్రెటీలతో పాటు అభిమానులకు ఎంతో ఇష్టుడు.

పునాదిరాళ్ళు సినిమాలో రాము పాత్రలో తొలిసారిగా కెమెరా ముందు నటించారు మెగాస్టార్ చిరంజీవి. అలా మొదలైన సినీ జర్నీలో విలన్ గా నలుగురు స్నేహితుల్లో ఒకరుగా ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు చిరు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే ఆయన నేచర్ సినీ పరిశ్రమలో అందరివాడుగా చేసింది..

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇక కెరీర్ మొదట్లోనే మెగాస్టార్ చిరంజీవి ప్రతిభను గుర్తించిన ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖ ను ఇచ్చి పెళ్లి చేశారు. ఫిబ్రవరి 20, 1980 న, మెగాస్టార్ చిరంజీవి సురేఖల వివాహం జరిగింది. ఇటీవలే తమ పెళ్లి రోజు జరుపుకున్నారు చిరంజీవి సురేఖ దంపతులు..

తాజాగా 80 కి సంబంధించిన చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఓ అరుదైన ఒక ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో చిరంజీవి చేతిలో కెమెరా ఉంది. సురేఖ పక్కన ఒక చిన్నారి.. చేతిలో ఒక చిన్నబాబు ఉన్నాడు.. ఈ ఫాటో లో ఎవరో చెప్పుకోండి అంటూ ఫ్యాన్స్  షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

చిరంజీవి భార్య సురేఖ ముద్దుల తనయుడు రామ్ చరణ్ పట్టుకుని, తన పెద్ద కుమార్తె సుష్మితకు ఏదో చెబుతుంది. సురేఖా, రామ్ చరణ్, సుష్మితలతో చిరంజీవి కలిసి ఉన్న ఫోటో ఫై ఓ లుక్ వేయండి మీరు .. రామ్ చరణ్ తండ్రి వారసుడుగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి సినిమాలు చేస్తూ.. తండ్రి కి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఆర్ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగించుకున్న రామ్ చరణ్ తాజాగా ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. ఈ సినిమా తాజా షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే..

Also Read:

హెల్మెట్ లేదని మహిళకు రూ.500 ఫైన్.. ట్రాఫిక్ పోలీసులకు మంగళసూత్రం ఇచ్చేసిన యువతి

ట్విట్టర్‌ నన్ను చూసి భయపడుతోంది. నేను ఏది మాట్లాడినా అది దేశం కోసమే.. కంగానా ఆసక్తికర వ్యాఖ్యలు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu