Money: మంగళ, శుక్రవారాల్లో డబ్బు ఇస్తే ఏం అవుతుంది? శాస్త్రాలు ఏం చెప్పాయంటే!

|

Oct 13, 2024 | 2:41 PM

ప్రస్తుత కాలంలో అంతా డబ్బుమయమే. అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. ఏం చేయాలన్నా.. ఏం కావాలన్నా.. డబ్బుతోనే పని. డబ్బు లేకపోతే సమాజంలోనే కాదు.. ఇంట్లో కూడా గౌరవం లభించదు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషి విలువ కూడా ఇవ్వడం లేదు. ఏం కొనాలన్నా డబ్బే కావాలి. ప్రపంచ దేశాలు కూడా డబ్బుపైనే ఆధార పడ్డాయి. మనుషులకు కూడా డబ్బే ముఖ్యంగా మారింది. ఈ డబ్బు కోసమే ఎన్నో దారుణాలకు..

Money: మంగళ, శుక్రవారాల్లో డబ్బు ఇస్తే ఏం అవుతుంది? శాస్త్రాలు ఏం చెప్పాయంటే!
Money
Follow us on

ప్రస్తుత కాలంలో అంతా డబ్బుమయమే. అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. ఏం చేయాలన్నా.. ఏం కావాలన్నా.. డబ్బుతోనే పని. డబ్బు లేకపోతే సమాజంలోనే కాదు.. ఇంట్లో కూడా గౌరవం లభించదు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషి విలువ కూడా ఇవ్వడం లేదు. ఏం కొనాలన్నా డబ్బే కావాలి. ప్రపంచ దేశాలు కూడా డబ్బుపైనే ఆధార పడ్డాయి. మనుషులకు కూడా డబ్బే ముఖ్యంగా మారింది. ఈ డబ్బు కోసమే ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎలాంటి దారుణాలు చేయడానికైనా వెనకాడటం లేదు. అందులోనూ హిందువులు డబ్బుకు మరింత ఇంపార్టెంట్స్ ఇస్తారు. లక్ష్మీ దేవితో సమానంగా చూస్తారు. పొరపాటున కింద పడ్డా.. కళ్లకు అద్దుకుని తీసుకుంటారు.

పూర్వం నుంచి..

అయితే మంగ, శుక్ర వారాల్లో డబ్బును ఎవరికైనా అప్పుగా ఇచ్చేందుకు చాలా ఆలోచిస్తారు. ఈ నియమం ఇప్పటి నుంచి కాదు.. పూర్వం నుంచి కూడా ఉంది. మంగళ, శుక్ర వారాల్లో లక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్లీ తిరిగి రావని నమ్ముతారు. మరి ఈ రోజుల్లో డబ్బును అప్పుగా ఇవ్వకూడదా? అసలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక సమస్యలు వస్తాయని..

మంగళ అంటే శుభం అని అర్థం. అందులోనూ మంగళవారానికి అధిపతి కుజగ్రహం. ఈయన యుద్ధ కారుడు. ఇలాంటి రోజున డబ్బులు అప్పుగా ఇస్తే తిరిగి వెనక్కి రావని, ఆర్థిక సమస్యలు వస్తాయని భావిస్తారు. అందుకే ఈ రోజున ఎక్కువగా ఖర్చు పెట్టడానికి, అప్పుగా ఇవ్వడానికి ఇష్ట పడరు.

ఇవి కూడా చదవండి

అప్పు ఇస్తే వెనక్కి రాదు..

పైన చెప్పినవే శుక్రవారం కూడా పాటిస్తారు. అందులోనూ శుక్ర వారం లక్ష్మీ దేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ రోజు కూడా డబ్బును ఇస్తే తిరిగి వెనక్కి రాదని నమ్ముతారు. అందుకే శుక్రవారం కూడా అప్పు ఇవ్వరు.

అయితే వాస్తవానికి మాత్రం.. మంగళ, శుక్ర వారాల్లో డబ్బును ఎవరికీ ఇవ్వరాదని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఎవరికైనా కష్టాల్లో ఉంటే డబ్బును ఇవ్వవచ్చు. అలాగే ఖర్చు పెట్టవచ్చు. ఇది కేవలం అపోహ మాత్రమే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..