
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడిని తొమ్మిది గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. మనిషి జాతకంలో సూర్యుని ఇల్లు, స్థానం అతని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని చెబుతారు. సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. సూర్య స్థానం బలహీనమైన స్థానంలో ఉంటే అనేక లక్షణాలు కనిపిస్తాయి. అవి వ్యక్తి జీవితంలోని వివిధ అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. బలహీనమైన సూర్యుని లక్షణాలు, నివారణలు ఏమిటో తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు తులారాశిలో బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు జాతకంలో సూర్య స్థానం బలహీనంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు సూర్యుడు 6వ, 8వ లేదా 12వ ఇంట్లో ఉండటం వల్ల కూడా బలహీనంగా ఉంటాడు. సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి విశ్వాసం, ఆత్మగౌరవం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రభావితమవుతాయి.
సూర్యుడు బలహీనంగా ఉంటే ఏమి చేయాలి?
జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక నివారణలు సూచించబడ్డాయి. సూర్యుడిని బలోపేతం చేయడానికి, సూర్యుడికి క్రమం తప్పకుండా అర్ఘ్యం సమర్పించండి. సూర్య నమస్కారం చేయండి. గాయత్రి మంత్రాన్ని జపించండి. సూర్య భగవానుడిని పూజించండి. పేదలకు దానం చేయండి. తండ్రిని గౌరవించండి. ఆదివారాలు ఉపవాసం ఉండండి. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. దానధర్మాలు చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.