Vastu Tips: ఈ వస్తువులు ఇతరుల నుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు.. లేదంటే కష్టాలు తప్పవు..

|

Apr 20, 2024 | 2:41 PM

వాస్తు శాస్త్రం ప్రకారం మనం ధరించే వాచ్ ను పొరపాటున కూడా ఇతరులు ధరించడానికి ఇవ్వరాదు. అదే విధంగా ఇతరుల వాచ్ ను మీరు ధరించరాదు. చేతి గడియారం సమయాన్ని తెలియజేయడమే కాదు.. ప్రతి  వ్యక్తి జీవితంలో మంచి, చెడుల్లో తోడుగా ఉంటుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఎవరికైనా చెడు సమయం నడుస్తుంటే.. ఆ సమయంలో అతని చేతి వాచ్ ను మీరు ధరించినట్లు అయితే.. ఆ ప్రభావం మీ జీవితంపై చూపిస్తుంది.   

Vastu Tips: ఈ వస్తువులు ఇతరుల నుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు.. లేదంటే కష్టాలు తప్పవు..
Vastu Tips
Follow us on

మనకు ఉన్నదానితో ఇతరులతో పంచుకోవడం మంచిదని (షేర్ చేయడం అనేది కేరింగ్)  పెద్దలు చెప్పడం తరచుగా వినే ఉంటారు. ఇది ముమ్మాటికీ నిజం మనకు ఉన్నదానిని మన వారితో లేదా అవసరం ఉన్నవారికి ఇవ్వడం మంచిది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం ఉపయోగిస్తున్న వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల వ్యక్తి జీవితంలో విభేదాలతో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయని నమ్మకం.

వాచ్:

వాస్తు శాస్త్రం ప్రకారం మనం ధరించే వాచ్ ను పొరపాటున కూడా ఇతరులు ధరించడానికి ఇవ్వరాదు. అదే విధంగా ఇతరుల వాచ్ ను మీరు ధరించరాదు. చేతి గడియారం సమయాన్ని తెలియజేయడమే కాదు.. ప్రతి  వ్యక్తి జీవితంలో మంచి, చెడుల్లో తోడుగా ఉంటుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఎవరికైనా చెడు సమయం నడుస్తుంటే.. ఆ సమయంలో అతని చేతి వాచ్ ను మీరు ధరించినట్లు అయితే.. ఆ ప్రభావం మీ జీవితంపై చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉంగరం:

వాస్తు శాస్త్రం ప్రకారం వేరొకరి ఉంగరాన్ని పొరపాటున కూడా మీ వేలికి ధరించకూడదు. ఎందుకంటే ఉంగరంలో ఉండే రత్నం, లోహం ఇలా ఏదైనా సరే ఏదొక గ్రహానికి లేదా రాశికి సంబంధించినది. అందువల్ల, వేరొకరి ఉంగరం మీరు ధరిస్తే వారి జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

బట్టలు:

ప్రజలు తరచుగా తమ అవసరాన్ని బట్టి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య బట్టలు మార్పిడి జరుగుతూ ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరైనా ఇలా చేయకూడదు. దీనికి కారణం బట్టలు మార్చుకోవడం ద్వారా ఆ వ్యక్తి దురదృష్టం బట్టలు ధరించిన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది.

బూట్లు, చెప్పులు:

ఎవరైనా సరే ఇతరుల నుండి బూట్లు, చెప్పులు అరువుగా తీసుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా  ధరించకూడదు.  అలా చేయడం అశుభం. గ్రంధాల ప్రకారం శని మానవుల పాదాలలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో మనం ఇతరుల బూట్లు, చెప్పులు ధరిస్తే శనిగ్రహం ప్రభావం అవతలి వ్యక్తులపై పడవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం, కలహాలు ఏర్పడతాయి.

పెన్ లేదా కలం

తరచుగా మనం ఆఫీసులో లేదా బ్యాంకులో ఎవరినైనా పెన్ను కోసం అడుగుతాము. ఒకొక్కసారి దానిని తిరిగి ఇవ్వడం మరచిపోతాము. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది చాలా తప్పుడు చర్యగా కూడా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒకరి అదృష్టం అతని కలంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో,ఎవరైనా వ్యక్తి తన జీవితంలో చెడు దశను ఎదుర్కొంటున్నట్లయితే.. మీరు తెలియకుండానే అతని పెన్ను తీసుకోవడం ద్వారా అతని సమస్యలను మీరే తీసుకుంటారని లెక్క. అటువంటి పరిస్థితిలో, మీరు ఎప్పుడైనా వేరొకరి పెన్ను తీసుకోవలసి వస్తే, దానిని ఖచ్చితంగా తిరిగి ఇవ్వండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు