Vastu Tips: ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడమే ఆర్థిక ఇబ్బందులకు మూలం.. మరి ఎక్కడ పెట్టాలంటే..

|

Jan 19, 2023 | 10:39 AM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఊడ్చే చీపురుని కూడా ఎలా పడితే పడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ధనానికి మూలమైన లక్ష్మీదేవికి కోపం..

Vastu Tips: ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడమే ఆర్థిక ఇబ్బందులకు మూలం.. మరి ఎక్కడ పెట్టాలంటే..
Broom Vastu Tips
Follow us on

మన దేశంలో ఇప్పటికీ చాలా మంది వాస్తు శాస్త్రంలోని పద్ధతులను, నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువును, గదిని సరైన దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఊడ్చే చీపురుని కూడా ఎలా పడితే పడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ధనానికి మూలమైన లక్ష్మీదేవికి కోపం వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే చీపురు విషయంలోకొన్ని నియమాలను కచ్చితంగా పాటించి తీరాలి. లేకపోతే కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన హిందూ ధర్మంలో చీపురు చాలా పవిత్రమైనది. సాక్షాత్ లక్ష్మీదేవి ప్రతీకగా కూడా చీపురును భావిస్తారు. అందువల్ల మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చీపురు విషయంలో చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు చూద్దాం..

ముఖ్యంగా విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు అనేదే నిల్వ ఉండదు. అలాగే చీపురు కింద వేసి తొక్కకూడదు. అలా చేస్తే లక్ష్మి దేవికి ఆగ్రహం కలిగిస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వంట గదిలో చీపురును ఉంచకూడదు. కిచెన్లో చీపురును ఉంచితే ఇంట్లోనివారికి ఆహారం దొరకడం కష్టంగా మారుతుంది. చీపురే కాదు.. ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ధనం, ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు. అలాగే చీపురును ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకూడదు. చీపురుని వాడిన తర్వాత దానిని అడ్డంగా పెట్టి.. ఏదైనా తలుపు వెనకాల ఉంచాలి. అలాగే పాడైపోయిన చీపురుతో ఇంటిని ఊడవకూడదు. అదే విధంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిని ఊడవకూడదు. ఒకవేళ ఊడ్చినా చెత్తను బయట పడెయ్యకూడదు. చీపురును ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడకూడదు.

అలాగే పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే పడేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి పవిత్రమైన రోజుల్లో చీపురును పడవేయకూడదు. కేవలం శనివారం మాత్రమే పారేయాలి. అమావాస్య రోజున కూడా ఈ పని చేయవచ్చు. అయితే ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా పాడేయాలి. విరిగిపోయిన చీపురును పారే కాలువలో ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లే అవుతుంది. అలాగే చీపురును ఎల్లప్పుడు కూడా మంగళవారం, శనివారం, అమావాస్యల రోజుల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా కృష్ణ పక్షంలో కొనడం మంచిది. ఇంట్లో పసిబిడ్డలు పుట్టినప్పుడు కూడా పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఇంట్లో అప్పటివరకు ఉపయోగించిన చీపురును మళ్లీ ఉపయోగించకూడదని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతేకాదు పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..