Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం, అలంకరణ ఇలా ప్రతిదానికీ దానికి ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులను ఉంచడానికి స్థలం విషయంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోము.. వాస్తు నియమాలను మరచి.. వస్తువులను సరైన స్థలంలో ఏర్పాటు చేసుకోము. ఇలా చేయడం వలన ఇంటిలో గొడవలు, చిరాకులు, సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఇంటి వాస్తు దోషాలను వీలైనంత త్వరగా తొలగించుకోవడం చాలా ముఖ్యం.
ప్రజలు తమ ఇళ్లలో అద్దాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అందం కోసం అద్దాలను ఇంట్లో వివిధ ప్రదేశాల్లో .. నచ్చిన సైజుల్లో ఏర్పాటు చేసుకుంటారు. అయితే అద్దం పెట్టడానికి కూడా నిర్దిష్టమైన స్థలం, సైజ్ గురించి ఎప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించారా?
మీ ఇంటిలో నైరుతి దిశలో బాత్రూమ్ లేదా టాయిలెట్ ఉంటే.. అప్పుడు అద్దాన్ని తూర్పు దిశలోని గోడకు చదరపు ఆకారంలోని అద్దాన్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి.
ఇంటి నిర్మాణంలో ఏదైనా భాగం అసాధారణ ఆకారంలో లేదా చీకటిగా ఉన్నట్లు అయితే.. అటువంటి ప్రాంతంలో అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అద్దం ఉంచడం ద్వారా శక్తిని సమతుల్యం చేసుకోవచ్చు.
అంతేకాదు.. మీ ఇంటి వెలుపల.. విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు, భారీ చెట్లు లేదా పదునైన చెట్ల భాగాలు ఉన్నట్లు అయితే.. అటువంటి ఇంటి ప్రధాన ద్వారం వద్ద అద్దం ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసే అద్దాన్ని అష్టభుజిలా ఉండి.. చెక్క ఫ్రేమ్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకునే అద్దానికి ఫ్రేమ్ .. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు , బంగారం రంగులో ఉండెలా చూసుకోవాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం పై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)