Vastu Tips: దీపం వెలిగించే ముందు ఈ నియమాలు గుర్తుంచుకోండి.. ఏ దిశలో దీపం పెట్టడం శ్రేయస్కరం అంటే..

|

Jul 13, 2024 | 7:23 AM

ఏదైనా పూజ లేదా శుభకార్యం మొదలు పెట్టే ముందు దీపం వెలిగిస్తారు. అప్పుడు పూజని నియమానుసారం మొదలు పెట్టినట్లు భావిస్తారు. అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయని మీకు తెలుసా..! ఈ నియమాలను పాటించడం ద్వారా పూజిస్తే పుణ్య ఫలితాలను పొందుతారని... కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. ఈ రోజు దీపం వెలిగించడానికి వాస్తు నియమాలు, దాని ప్రభావం గురించి తెలుసుకుందాం..

Vastu Tips: దీపం వెలిగించే ముందు ఈ నియమాలు గుర్తుంచుకోండి.. ఏ దిశలో దీపం పెట్టడం శ్రేయస్కరం అంటే..
Vastu Tips
Follow us on

హిందూ మతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజలో దీపం, ధూపం, పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యం ఇలా అనేక వస్తువులను దేవుడికి సమర్పిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రంలో కూడా దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ఏదైనా పూజ లేదా శుభకార్యం మొదలు పెట్టే ముందు దీపం వెలిగిస్తారు. అప్పుడు పూజని నియమానుసారం మొదలు పెట్టినట్లు భావిస్తారు. అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయని మీకు తెలుసా..! ఈ నియమాలను పాటించడం ద్వారా పూజిస్తే పుణ్య ఫలితాలను పొందుతారని… కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. ఈ రోజు దీపం వెలిగించడానికి వాస్తు నియమాలు, దాని ప్రభావం గురించి తెలుసుకుందాం..

  1. దీపం వెలిగించే సమయంలో వత్తి ఎల్లప్పుడూ తూర్పు దిశ లేదా ఉత్తరం వైపు ఉండాలి. పూజ చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించిన వెంటనే .. ఇతర నూనెలతో దీపాలను వెలిగించరాదు.
  2. దీపాన్ని ఎల్లప్పుడూ తూర్పు ముఖ్యంగా ఉంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
  3. దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు, జ్ఞానం పెరుగుతుంది.
  4. దీపాన్ని పడమర వైపు ఉంచడం వలన జీవితంలో ఆటంకాలు కలుగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వలన హాని కలుగుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి. జీవితం చికాకుగా చిక్కులతో సాగుతుంది.
  7. హిందూ మత ఆచారం ప్రకారం దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుడి విగ్రహం లేదా చిత్ర పటం ముందు వెలిగేలా ఉంచాలి.
  8. దీపాన్ని నూనెతో పెట్టేవారు ఎరుపు వత్తిని ఉపయోగించడం శ్రేయస్కరం.
  9. ఇంట్లో రోజూ పూజ గదిలో దీపం వెలిగిస్తుంటే పత్తి దూదితో చేసిన వత్తిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణింపబడుతున్నది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు