ప్రస్తుతం మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో ఉదయం చేసే పని రాత్రి.. రాత్రి చేసే పనులు చేయాల్సి వస్తుంది. తినే ఆహారం నుంచి నిద్ర, బట్టలు ఉతకడం వంటి అనేక విషయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం సమయంలో బిజీబిజీగా గడిపే చాలా మంది మురికి బట్టలను రాత్రి సమయంలో ఉతుక్కుంటున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడానికి లేదా ఇంట్లో వస్తువులను ఉంచడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలు మూఢనమ్మకాలు అనుకోవద్దు. కొన్ని నియమాలు ఆరోగ్యం కోసం.. అంతేకాదు కుటుంబం జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తిని తెచ్చేందుకే.. కనుక ఇంట్లో వివిధ వస్తువులను ఎక్కడ ఉంచాలి, ఏ పరిమాణంలో ఉండాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఈ నిబంధనలలో బట్టలు ఉతకడానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
వాస్తు ప్రకారం మురికి బట్టలు ఉతకడానికి సరైన సమయం కూడా ఉంది. అందుకే బట్టలను రాత్రి సమయంలో ఉతక కుండా ఉదయం సమయంలో ఉతకాలని పేర్కొన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నియమం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఉదయం హడావిడిగా ఉద్యోగానికి వెళ్ళే వారు సమయాన్ని వృథా చేయకుండా రాత్రి సమయంలో అన్ని పనులను పూర్తి చేసుకోవాలని భావిస్తారు. చేసుకుంటారు కూడా.. అయితే రాత్రి సమయంలో ఉతికిన బట్టలు ధరించడం చాలా అశుభకరమైనవిగా అనారోగ్య కరమైనవి గా పరిగణించబడుతున్నాయి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.