Vastu Tips: ఈ దిక్కులో టీవీ ఉంచితే అనర్థాలు తప్పవు! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే..
ఇంట్లో టీవీ, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా వాస్తు వర్తిస్తుందా? వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ వస్తువులను సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. ఒక దిక్కులో పెట్టడం వల్ల వినోదం లభించినా, అదే దిక్కు పిల్లల చదువులకు నష్టం కలిగించవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లో టీవీలాంటి వస్తువులను ఎక్కడ పెట్టాలో, వాటి వాస్తు నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలక్ట్రానిక్ వస్తువులు సౌకర్యం, వినోదం కోసం మనం నిత్యం ఉపయోగిస్తుంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ వస్తువులను సరైన దిక్కులో ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. కానీ టీవీ, కంప్యూటర్ లాంటివి వాస్తుపరంగా సరైన దిక్కున పెట్టినా, ఇంట్లో ఉన్న పిల్లలకు నష్టం కలిగించవచ్చు. మరి ఈ వస్తువులను ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈశాన్యం (నార్త్ ఈస్ట్): వినోదానికి ఉత్తమమైన దిక్కు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లాంటివి ఈశాన్యంలో ఉంచడం మంచిది. ఈ దిక్కును ఎంటర్టైన్మెంట్ జోన్‌గా భావిస్తారు.
అయితే, ఈ స్థానంలో టీవీ పెట్టినప్పుడు పిల్లలు ఆ దిక్కున కూర్చుని చూడటం వల్ల చదువు వదిలేసి వాటికి అలవాటు పడిపోతారు. కాబట్టి వాస్తు పెద్దలకు, పిల్లలకు ఇద్దరికీ లాభించేలా చూసుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఈ దిక్కున టీవీ పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి.
నైరుతి (దక్షిణ నైరుతి): ఫలితాలు ఉండవు
దక్షిణ నైరుతిలో కూర్చుని టీవీలు చూసినా, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించినా సమయం వృథా అవుతుంది. ఈ దిక్కున కూర్చుని పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు లభించవని శాస్త్రం చెబుతోంది. ఏవైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు అక్కడ కూర్చుని చేస్తే ఫలితం రాదు. పడమర నైరుతి కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది.
పడమర నైరుతి: చదువులకు నష్టం
పడమర నైరుతి అనేది ఎడ్యుకేషన్ జోన్. పిల్లలు చదువుకోవడానికి ఈ స్థానం అనువైనది. ఈ దిక్కులో టీవీలు లాంటివి పెడితే పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరని వాస్తు శాస్త్రం చెబుతోంది.
పడమర వాయవ్యం: ఒత్తిడి పెరుగుతుంది
వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పడమర వాయవ్యం అనేది డిప్రెషన్ జోన్. ఈ దిక్కులో టీవీలు పెట్టుకుని చూసేవాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ.
ఇతర వస్తువుల వాస్తు
వాస్తు ప్రకారం, ఎయిర్ కండిషనర్ లాంటివి ఉత్తర, పడమర దిశలో పెట్టుకోవాలి.
గమనిక: ఈ కథనం వాస్తు శాస్త్రం, ప్రజల సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి రూపొందించబడింది. ఇక్కడ పేర్కొన్న అంశాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ప్రచురించబడింది. పాఠకులు వీటిని ఒక నమ్మకంగా మాత్రమే చూడాలి.




