Vastu Tips for Light: ఇంట్లో లైటింగ్ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!

|

Jul 03, 2023 | 6:01 AM

ఇంటికి, ఇంట్లోని ప్రతి వస్తువుకు, వాస్తు నియమాలకు సంబంధం ఉంది. ఇది మీ అదృష్టానికి, మీ పరిస్థితులపై ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఉంచిన వస్తువులు మనలో సానుకూల, ప్రతికూల ఆలోచనను కలిగిస్తాయి. వస్తువులు ఏర్పాటు చేసే దిశ మాత్రమే కాకుండా ఇంట్లో దీపాలు/లైట్స్ ఏర్పాటు చేసే అంశం కూడా చాలా కీలకం.

Vastu Tips for Light: ఇంట్లో లైటింగ్ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!
Lighting
Follow us on

ఇంటికి, ఇంట్లోని ప్రతి వస్తువుకు, వాస్తు నియమాలకు సంబంధం ఉంది. ఇది మీ అదృష్టానికి, మీ పరిస్థితులపై ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఉంచిన వస్తువులు మనలో సానుకూల, ప్రతికూల ఆలోచనను కలిగిస్తాయి. వస్తువులు ఏర్పాటు చేసే దిశ మాత్రమే కాకుండా ఇంట్లో దీపాలు/లైట్స్ ఏర్పాటు చేసే అంశం కూడా చాలా కీలకం. ఏదైనా ఇల్లు కట్టిన తర్వాత దాని అందాన్ని పెంచేందుకు లైటింగ్ అనేది కీలకం. అందమైన లైట్లు ఇంటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఇంటికి వెలుగుతో పాటు పాజిటివ్ ఎనర్జీని అందించేందుకు లైట్లు పనిచేస్తాయి. అయితే ఇంట్లో పెట్టుకునే ఈ లైట్లు వాస్తు దోషాలకు కూడా కారణమవుతాయని మీకు తెలుసా? వాస్తు పండితులు చెబుతున్న కీలక వివరాలు మీకోసం..

బెడ్ రూమ్‌ లో లైటింగ్ ఎలా ఉండాలి?

పడకగదిలో మంచం ముందు గోడపై లైట్ ఉంచాలి. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భార్యాభర్తల మంచి బంధానికి ఇది చాలా మంచిది. గదికి దక్షిణ దిశలో లైట్‌ని ఏర్పాటు చేయవద్దు. ఇది శుభం కాదు, ప్రతికూల శక్తిని తెస్తుంది.

వంటగది లైట్ విషయంలో జాగ్రత్త..

వంటగదిలో తూర్పు దిక్కున దీపం ఉంటే తిండి గింజలు, ధనానికి లోటుండదు. సాయంత్రం వేళ వంటగదిలో ఎప్పుడూ కాంతి రావాలని, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇది ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

తక్కువ కాంతి ప్రభావం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి లోపల వెలుతురు ఎక్కువగాగానీ, తక్కువగాగానీ ఉండకూడదు. కాంతి లేకపోవడం మీ పురోగతిని ఆపవచ్చు. దీని వల్ల పనితీరులో కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు. దీంతో పాటు కళ్లు కూడా చెడిపోతాయి. వెలుతురు సరిగ్గా లేకుంటే వాస్తు దోషం ఏర్పడి ప్రతికూలత పెరగడం మొదలవుతుంది.

ఈ దిశలో లైట్స్ ఏర్పాటు చేయొద్దు..

ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌లో ఎప్పుడూ పడమర దిక్కున లైట్స్ పెట్టకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మెయిన్ హాల్‌లో ఉత్తరం వైపు దీపాలు పెడితే శుభం కలుగుతుంది. దీంతో ఇంటికి శాంతి చేకూరుతుంది. పడమర దిక్కు తప్ప ఏ దిక్కులోనైనా లైట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు.

కలర్ లైట్స్‌కు ఈ దిశ సరైనది..

ఇంట్లో లైట్స్ తమ ఇష్టానుసారంగా అమర్చకూడదు. మీరు కలర్ లైట్స్ ఏర్పాటు చేయాలనుకుంటే.. వాటిని ఆలయంలో మాత్రమే అమర్చాలి. ఇంట్లోని ఇతర భాగాలలో రంగురంగుల లైట్లు పెట్టడం వల్ల జీవితంలో సమస్యలు వస్తాయి. ఇంట్లో శాంతిని కాపాడుకోవడానికి, తెల్లటి లైట్స్‌ను మాత్రమే ఉపయోగించాలి.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, ప్రజల విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది. )

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..