చాలా మంది ఇళ్ళల్లో ఏదో ఒక సమస్య ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరిపోయింది అనుకునేలోగా మరొక సమస్య కలిగి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి కారణం యాదృచ్చికం అని కొందరు భావిస్తే.. మరొకొందరు తలరాత అని నిరాశను వ్యక్తం చేస్తారు. అయితే ఇంట్లో వస్తువులు పెట్టె ప్లేస్ కూడా మీ జీవితంలో పెను మార్పులను కలిగిస్తాయి. చిన్న వస్తువులే కదా అని నిర్లక్ష్యం చేస్తే పెద్ద మార్పును కలిగిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువులు నెగెటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. అలాంటి వాటిని ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో అలాంటి వస్తువులను ఉంచినట్లయితే, వెంటనే వాటిని తొలగించండి. వాస్తు ప్రకారం అది సరైనది కాదు.ఈ రోజు ఇంట్లో పొరపాటున కూడా ఉంచకూడని కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం..
కాక్టస్ మొక్క: ముళ్ల మొక్కలు ఇళ్లలో నాటకూడదు. ప్రజలు వీటిని అలంకరణ కోసం ఇంట్లో పెట్టుకుంటారు. అయితే అది సరైనది కాదు. అయితే ఈ ముళ్ళ మొక్కలకి కూడా మినహాయింపు ఉంది. ఇళ్లలో గులాబీ మొక్కలను నాటవచ్చు. ఇందులో ఎలాంటి సమస్య లేదు. ఇంట్లో గులాబీ తప్ప మరే ఇతర ముళ్ల మొక్కను పెంచుకోరాదు.
నటరాజ విగ్రహం: ఎక్కువ మంది తమ ఇళ్లలో నటరాజ విగ్రహాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కళాకారులు తప్పకుండా నటరాజును తమ ఇంట్లో పెట్టుకుంటారు. అయితే నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు. ఒకవైపు నటరాజ విగ్రహం కళకు ప్రతీక అయితే, మరోవైపు విధ్వంసానికి ప్రతీకగా కూడా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో ఉంచడం సరికాదు.
నీటి ఫౌంటెన్: చాలా మంది తమ ఇళ్లను రకరకాలుగా అలంకరిస్తారు. ఈ అలంకరణల కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు కూడా. అయితే ఇంటిని ఎలా , ఏ వస్తువులతో అలంకరించాలో సరైన వాస్తు జ్ఞానం కలిగి ఉండటం కూడా ముఖ్యం. ఇంట్లోకి ఎప్పుడూ వాటర్ ఫౌంటెన్ తీసుకురాకూడదు. ప్రవహిస్తున్నట్లు చూపించే చిత్ర పటలను కూడా ఇంట్లో పెట్టుకోరాదు. ఇంటికి వచ్చే సంతోషం, ఐశ్వర్యం వచ్చిన వెంటనే పోతుంది. ఎంత డబ్బులు సంపాదించినా ఎక్కువ కాలం నిలవదు.
పగిలిన గాజు శిల్పాలు: అద్దం ఒక్కసారి పగిలినా ఉపయోగం ఉండదు. అదే విధంగా పగిలిన గాజులు, విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. అయితే చాలామంది ప్రజలు తమ ఇళ్లలో పగిలిన గాజులు, విరిగిన విగ్రహాలను ఉంచడం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతుంది. దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎప్పుడూ పగిలిన గాజులు, విగ్రహాలను ఉంచకూడదు. పగిలిన వెంటనే వాటిని తీసివేయాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు