వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం వల్ల ఇంటిలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఆ ఇంట్లో నివసించే వారు ప్రశాంతంగా జీవిస్తారని నమ్ముతారు. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎక్కడ కూర్చుని తినాలో కూడా ప్రస్తావన ఉంది. జీవితంలో పురోగతి , విజయం కావాలంటే.. ఎవరైనా సరైన దిశలో కూర్చొని ఆహారం తినాలి. ప్రతి దిశలో వివిధ రకాల శక్తి ప్రవాహాలు ఉంటాయి. కనుక సరైన దిశలో కూర్చుని భోజనం చేస్తే.. అక్కడి శక్తి శరీరానికి మేలు చేస్తుంది.
తూర్పు ముఖంగా భోజనం చేయడం:
తూర్పు ముఖంగా భోజనం చేయడం వల్ల మెదడుకు మంచిది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలా ఈ దిశలో తినడం వృద్ధులకు, రోగులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా కడుపు సమస్యలు ఉన్నవారు తూర్పు దిశలో కూర్చుని తినాలి.
పశ్చిమం వైపు తిరిగి భోజనం చేయడం:
పశ్చిమ దిశను లాభ దిశ అంటారు. ఈ దిశలో కూర్చుని తినడం వల్ల పురోగతికి మార్గం సుగమం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశ వ్యాపారం, పని, రచన, పరిశోధన, విద్యకు సంబంధించిన వ్యక్తులకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఉత్తర దిశ:
ఉత్తర దిశను సంపద, జ్ఞానానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో కూర్చుని తినడం బుద్ధికి మంచిది. విజయానికి దారి తీస్తుంది. యువకులు, విద్యార్థులు భోజనం చేసేటప్పుడు ఉత్తర దిశలో కూర్చోవాలి.
ఈ దిశలో కూర్చుని తినకూడదు:
వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశ యమ ధర్మ రాజు (మృత్యుదేవత) దిశ. యముడుకి సంబందించిన దిశకు ఎదురుగా కూర్చుని తినడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది. అంతేకాదు పేదరికానికి దారితీస్తుంది. కుటుంబంలో వివాదాలు పెరుగుతాయి. పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది. తల్లిదండ్రులున్నావారు ఈ దిశలో కూర్చుని తినే అలవాటుకి వెంటనే స్వస్తి చెప్పండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు