Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. వెంటనే వాస్తు నియమాలలో మార్పులు చేయండి..

|

Jan 23, 2022 | 5:18 PM

Vastu Tips: జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. ఇది లేనిదే ఏ పని జరుగదు. దీని లోటు వల్ల చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణుల

Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. వెంటనే వాస్తు నియమాలలో మార్పులు చేయండి..
Vastu Tips
Follow us on

Vastu Tips: జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. ఇది లేనిదే ఏ పని జరుగదు. దీని లోటు వల్ల చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ ఇంట్లో వాస్తు నియమాలు సరిగా లేకుంటే డబ్బులోటు ఏర్పడుతుంది. ఇంట్లో మీ లాకర్‌ని ఉంచే దిశ కూడా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే సరైన దిశలో డబ్బుని దాచడం ముఖ్యం. డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఆకర్షించడానికి ఈ వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు.

మీ లాకర్‌ను మీ ఇంటికి నైరుతి దిశలో ఉంచండి. ఈ ప్రాంతంలో ఖజానా ఉంచడం స్థిరత్వం, సంపదకి చిహ్నం. లాకర్ తలుపు పశ్చిమ దిశలో ఎప్పుడు ఓపెన్ చేయకూడదని గుర్తుంచుకోండి. అలా చేస్తే డబ్బు వినాశనం జరుగుతుంది.
మీ నగదు, కార్డులను ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంచండి. ఉత్తర దిక్కు సంపదకు దేవుడు అయిన కుబేరుడు ఉంటాడని నమ్ముతారు. ఉత్తర దిశలో ఒక స్థలాన్ని ఎంచుకొని ప్రతిరోజు అక్కడ నగదు నిల్వ చేయండి. డబ్బును నాలుగు, ఐదు మూలల్లో ఉంచడం మానుకోండి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల డబ్బు ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ ఇంటి ప్రవేశ ద్వారం నుంచి చూస్తే మీ నగదు పెట్టె కనిపించకూడదు. వాస్తు ప్రకారం లాకర్‌ను అల్మారా లోపల లేదా కళ్లకు దూరంగా ఉంచడం మంచిది. మీ ఇంటి దక్షిణ దిశలో మీ నగదు పెట్టె లేదా లాకర్‌ను ఎప్పుడూ ఉంచవద్దు. మీ డబ్బును దక్షిణ దిశ నుంచి దూరంగా ఉంచడం మంచిది. బాత్‌రూమ్‌లు, కిచెన్‌లు, మెట్లు లేదా స్టోర్‌రూమ్‌ల దగ్గర లాకర్లు ఉంచవద్దు. ఇది డబ్బు వినాశనానికి కారణమవుతుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగిందని గమనించండి.

Digital Voter ID: డిజిటల్‌ ఓటర్ ఐడీ కార్డ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.. గుర్తింపు కార్డుగా ఎక్కడైనా పనిచేస్తుంది..

IND vs SA, 3rd ODI, LIVE Cricket Score: 30 ఓవర్లకు సౌతాఫ్రికా 170/3.. క్వింటన్‌ డికాక్‌ సెంచరీ..

Viral Photos: హరిద్వార్ పవిత్రమైన స్నానానికే కాదు.. ఈ ప్రదేశాలకు కూడా చాలా ఫేమస్..