Chanakya Niti: జీవితం సాఫీగా సంతోషంగా సాగాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను పాటించండి..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. దౌత్యం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు  వంటి విషయాలపై చాణక్యుడికి..

Chanakya Niti: జీవితం సాఫీగా సంతోషంగా సాగాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను పాటించండి..
Follow us

|

Updated on: Jan 24, 2022 | 12:46 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. దౌత్యం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు  వంటి విషయాలపై చాణక్యుడికి  మంచి పట్టుఉంది. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం (Chanakya Niti )నేటి మానవులకు అనేక జీవిత విధానాలను నేర్పుతుంది.  వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. చాణుక్యుడు మనిషి తన జీవితంలో ఇతరులకు కొన్ని చెప్పకూడని విషయాలు ఉన్నాయని అంటున్నాడు. అవి ఇతరులకు చెప్పడం వలన జీవితంలో అవమానాలు, నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నాడు అవి ఏమిటో తెలుసుకుందాం.

కుటుంబంలోని విబేధాలు: మీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు వచ్చినా ఇంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ చెప్పకూడదు. ఇలా ఇంటి విషయాలను ఎదుటివారితో పంచుకుంటే అవమానాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు అవతలివారు సమయం వచ్చినప్పుడు.. మీ సంబంధంలో వివాదాలను సృష్టించడానికి ఉపయోగించుకోవచ్చు.

వైవాహిక జీవితం గురించిన విషయాలు: చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన వైవాహిక జీవితంలోని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. భార్యాభర్తల మధ్య మాటలను వారికే పరిమితం కావాలి. ముఖ్యంగా భార్య భార్తల మధ్య ఏ రకమైన గొడవలు ఏర్పడినా ఈ విషయాన్ని మూడో వ్యక్తితో పంచుకోకూడదు. ఇలా చేయడం వలన భవిష్యత్తులో పరువు, గౌరవం కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు భార్యాభర్తల సంబంధంలో చీలికలు కూడా ఏర్పడవచ్చు.

ముఖ్యమైన పనులు చేపట్టిన విషయంలో: చాణక్య నీతి ప్రకారం.. ఎవరినా తన పనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను,ప్రణాళికలను ఇతర వ్యక్తుల వద్ద ప్రస్తావించకూడదు. ఇలా మీ పని విషయంలో మీ ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం వలన మీ పనుల్లో ఒకొక్కసారి నష్టాలను చవిచూడవలసి ఉంటుంది. విజయావకాశాలను కూడా ఒకొక్కసారి కోల్పోతారు. అందుకే ఎవరైనా పని చేపట్టి.. అది పూర్తయిన తర్వాతే చెప్పాలి.

బలహీనతలు : ప్రతి వ్యక్తికి బలం,బలహీనతలు ఉంటాయి. ఎవరినా సరే తమ బలహీనతలను ఇతరుల ముందు ఎప్పుడూ బయటపెట్టవద్దు. అలా చేయడం వలన ఇతరుల దృష్టిలో మీరు బలహీనంగా మారిపోతారు. లేదా ఒకొక్కసారి.. ఆ వ్యక్తులు ఎప్పుడైనా మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు.

ఒక వ్యక్తిలోని మంచి చెడులు: చాణక్య నీతి ప్రకారం.. ప్రతి వ్యక్తిలో మంచి, చెడు ఉంటాయి. కనుక ఎవరికైనా సరే ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని సరిగ్గా తెలియజేయాలి. అంతేకాదు ఎదుటివారి మంచి చెడుల గురించి మీ శత్రువుల దగ్గర ఎప్పడు ప్రస్తావించాదు.

బాధను వ్యక్తం చేయవద్దు చాణక్య నీతి ప్రకారం, .. ఒక వ్యక్తి తన బాధలను ఎవరి ముందు చెప్పకూడదు. దీని వల్ల ప్రజలు మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు. ఇది భవిష్యత్తులో మీ పనికి ఆటంకాలు కూడా కలగవచ్చు.

అవమాన పడినప్పుడు చాణక్యుడి నీతి ప్రకారం ఎవరైనా ఎక్కడైనా అవమానానికి గురైతే దానిని మీలోనే ఉంచుకోవాలి. ఎవరి ముందు కూడా ప్రస్తావించకూడదు. అలా మీకు జరిగిన అవమానాన్ని ప్రాస్తావిస్తే..ఎదుటివారు అపహాస్యం చేయవచ్చు.

Also Read:

 అనుమానాస్పదస్థితిలో నేల బావిలో శవమైన యువకుడు.. పోలీసుల దర్యాప్తులో సంచలనాలు!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?