Vastu Tips: కొత్త సంవత్సరంలో డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే, ఇంట్లో ఈ మార్పులు చేయండి..

|

Dec 31, 2022 | 10:03 PM

ఇంట్లో వాస్తు ప్రకారం నియమాలు పాటించకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు విషయంలో చేసే పొరపాట్ల కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీకి బదులు నెగెటివిటీ..

Vastu Tips: కొత్త సంవత్సరంలో డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే, ఇంట్లో ఈ మార్పులు చేయండి..
Money
Follow us on

ఇంట్లో వాస్తు ప్రకారం నియమాలు పాటించకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు విషయంలో చేసే పొరపాట్ల కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీకి బదులు నెగెటివిటీ ఎక్కువగా వస్తుంది. దాని ప్రభావం ఇంటిపై, ఇంట్లో నివసించే వారిపై పడుతుంది. ఫలితంగా ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. కొన్ని నివారణ చర్యలు చేపట్టడం తప్పనిసరి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుకోవచ్చు. ఫలితంగా ఆర్థిక నష్టాన్ని, అనారోగ్య సమస్యలను కూడా నివారించవచ్చు. మరి ఈ సమస్యలన్నీ పోయి.. అంతా హ్యాపీగా ఉండాలంటే, ఆర్థికంగా మంచి జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం..

1. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపున నీరు అస్సలు పెట్టకూడదు. అలాగే నీటికి సంబంధించిన యంత్రాలు, ఫ్రిజ్, ఆర్ఓ, వాటర్ బకెట్, టబ్, బాటిల్ వంటి ఏ వస్తువులు కూడా ఉంచకూడదు. నీటికి సంబంధించిన వస్తువులను ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.

2. వాస్తుశాస్త్రం ప్రకారం.. నీటికి నేరుగా సంబంధం ఉన్న షో పీస్ ఇంటి దక్షణ దిశలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల రుణభారం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

3. చీపురును ఇంట్లో సేఫ్ దగ్గర అస్సలు ఉంచకూడదు. దానివల్ల ఆర్థిక సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే చీపురును ఎప్పుడూ కింద పడుకోబెట్టాలి. నిలబెట్టకూడదు.

4. ముళ్లు ఉన్న మొక్కలను ఇంటి లోపల అస్సలు పెట్టకూడదు. మనీ ప్లాంట్, తులసి వంటి మొక్కలను నాటడం శుభప్రదంగా ఉంటుంది. దీంతోపాటు.. ఇంటి రంగు ముదురు రంగులో కాకుండా లేత రంగులో ఉండాలి. లైట్ పెయింట్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది.

గమనిక: ఇందులోని సమాచారం వాస్తు శాస్త్రం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..