Monthly Horoscope: ఈ రాశి వ్యాపారులకు జనవరిలో భారీ లాభాలు.. అందులో మీది ఉందా.?

వ్యాపారంలో భారీగా లాభాలు గడిస్తారు. పెట్టుబడి ఎక్కువ చేస్తారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంది. ఐటీ తదితర వృత్తి నిపుణులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది.

Monthly Horoscope: ఈ రాశి వ్యాపారులకు జనవరిలో భారీ లాభాలు.. అందులో మీది ఉందా.?
Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jan 01, 2023 | 5:00 AM

  • మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశి వారికి ఈ నెల ద్వితీయార్థం నుంచి చాలా బాగుంటుంది. ఈనెల 18న శని కుంభరాశిలోకి మారటం ఈ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి, ప్రమోషన్ కి అవకాశం ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. గతంలో చేసిన ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలను ఇస్తాయి. ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు సాగిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటే అవి ఫలిస్తాయి. కాలం అనుకూలంగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఐటి వారు అభివృద్ధి చెందుతారు.

  • వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశి వారికి జనవరి నెల ద్వితీయార్థం కంటే ప్రథమార్గం చాలా బాగుంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు చేయి దాటి పోతాయి. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు శక్తికి మించి సహాయం చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయవలసి వస్తుంది. సహచరుల విధులను కూడా పంచుకోవలసి వస్తుంది. దూర ప్రాంతాన్ని నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. అనుకోకుండా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. ఇరుగుపొరుగుతో విభేదాలు తల ఎత్తవచ్చు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిస్తారు.

  • మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1)

కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని తక్షణం ఆచరణలో పెట్టడం మంచిది. ఉద్యోగ పరంగా అంతా మంచే జరుగుతుంది. సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంతో విహారయాత్రకు వెళతారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా చక్కబడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. వృత్తి వ్యాపారాల వారు లాభాలు గడిస్తారు. ఐటీ నిపుణులు విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి, వడ్డీ వ్యాపారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, మద్యం వ్యాపారులకు సమయం చాలా బాగుంది. కొత్తవారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఆర్థిక లావాదేవీలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

  • కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనేక అవరోధాలను అధిగమించి, ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. అదనపు బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా కొద్దిగా మానసిక ప్రశాంతత తగ్గుతుంది. బంధువుల కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అంది కొన్ని అవసరాలు తీరుతాయి. వ్యవసాయం, న్యాయ శాఖ, సైన్యం, వాణిజ్యం, ఆర్థిక శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పురోగతి సాధిస్తారు. వారికి సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. అద్దె ఇంట్లోంచి సొంత ఇంటికి మారే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సంబంధమైన ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకోకుండా స్నేహితులలోనే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కోర్టు కేసు ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది.

  • సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొద్ది కాలం పాటు మౌనంగా ఉంటే ఆర్థిక విషయాలు సానుకూలంగా చక్కబడతాయి. బంధుమిత్రులలో ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేస్తే, అది తిరిగి రాకపోవచ్చు. కొంచెం పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలలో సొంత నిర్ణయాలు వల్ల ఫలితం ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ మీ రహస్యాలు పంచుకోవద్దు. సహచరులు కొందరు మీ పైన చెడు ప్రచారం సాగించే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం కొన్ని చికాకులతో నిండి ఉంటుంది. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. పొదుపు చేయడం మంచిది. విద్యార్థులు చదువుల్లో శ్రమ మీద రాణించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలలో అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. మధ్య మధ్య ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

మీ ఆలోచనలు, నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎవరితోనూ దురుసుగాను, అనాలోచితం గానూ వ్యవహరించవద్దు. కొద్దిగా సహనంగా వ్యవహరిస్తే మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అంతేకాక ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందుల్లో పడతారు. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాల బాగుంటుంది. దీనిని సద్వినియోగం చేసుకొని ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. తిప్పట, శ్రమ ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టులతో విభేదాలు లేదా అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. వాహనాలను వేగంగా నడపటం అంత మంచిది కాదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి.

  • తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వ్యాపారంలో భారీగా లాభాలు గడిస్తారు. పెట్టుబడి ఎక్కువ చేస్తారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంది. ఐటీ తదితర వృత్తి నిపుణులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థలాల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ప్రతిభను, సామర్థ్యాన్ని అధికారులు గుర్తిస్తారు. ఉద్యోగ పరంగా దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ చేయడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి అడుగు వేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. బంధు వర్గంలో మీ పలుకుబడి తిరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా మారుతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

  • వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ నెల ప్రథమార్ధం చాలావరకు అనుకూలంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కొంటారు. ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులు అండగా నిలబడతారు. ద్వితీయార్థంలో కొన్ని ఆందోళనకర వార్తలు వింటారు. ముఖ్యంగా దగ్గర బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విదేశాలలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు లేని వారికి సంతానయోగం ఉంది. అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువై ఇబ్బంది పడతారు. వ్యక్తిగత జీవితం క్షణం తీరిక లేకుండా ముందుకు సాగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. దుబారాకు దూరంగా ఉండండి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో కొన్ని ప్రతికూలతలు అనుభవానికి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించినంతగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.

  • ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

చాలా మార్గాలలో ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇల్లు మారాలన్న ఆలోచన వల్ల మంచి ఫలితం ఉండకపోవచ్చు. సొంత ఇంటి కల నెరవేరే సూచనలున్నాయి. అనవసర ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మొండి బకాయి ఒకటి వసూలు అవుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అధికారులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఈ నెల 18 తో ఏలినాటి శని ముగుస్తున్నందువల్ల ఉద్యోగ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలంగా మారే సూచనలున్నాయి. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. సమయం అన్ని విధాలుగాను బాగుంది కనుక కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనలతో సద్వినియోగం చేసుకుంటే మంచిది. తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. మీ గురించి కొందరు చెడు ప్రచారం సాగించే అవకాశం ఉంది. మీ ఆలోచనలను బయట వారితో పంచుకోవద్దు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు.

  • మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. కొత్త ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరిగినప్పటికీ సకాలంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల వారు లాభాల బాట పడతారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ పరమైన చిక్కుల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణ ఏర్పడుతుంది. బంధువులతో అపార్ధాలు తొలగుతాయి. జనవరి 18 తర్వాత శని కుంభంలోకి మారడంతో ఆర్థిక స్థోమత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడుస్తుంది. ఐటీ తదితర వృత్తి నిపుణులు తమ తమ రంగాల్లో ముందడుగు వేస్తారు. విదేశీ అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. విందులు వినోదాల మీద డబ్బు ఖర్చు చేస్తారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలాకాలంగా ప్రయత్నం చేస్తున్న పెళ్లి సంబంధం ఒకటి ఖాయం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

  • కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3).

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి ఇబ్బందులు పడతారు. సహచరుల బాధ్యతలు కూడా మీద పడతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి కొత్త ప్రయత్నాలకు అవకాశం కలుగుతుంది. వృత్తి నిపుణులు ఉద్యోగాలు మారటానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో సమస్యల్లో పడతారు. పొదుపు చేయడం చాలా మంచిది. ఇతరుల పొగడ్తలకు పొంగిపోయి మితిమీరిన ఔదార్యం ప్రదర్శించడం మంచిది కాదు. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చిన్న స్థాయి ఉద్యోగుల కోసం శిక్షణ తరగతులు చేపడతారు. రాదనుకున్న డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. జనవరి 18 తరువాత నుంచి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. విదేశాలతో సంబంధం ఉన్న కంపెనీలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులు తీపి కబురు వింటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ పరంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. ఎవరితోనూ మీ మనసులోని విషయాలను పంచుకోవద్దు. చాలాకాలంగా మనసులో ఉన్న కోరిక ఒకటి అనుకోని విధంగా నెరవేరుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే గాని ఉత్తీర్ణులు అయ్యే అవకాశం లేదు. ప్రేమ వ్యవహారాల్లో మధ్య మధ్య ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కోర్టు కేసు వాయిదా పడుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు.

  • మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశి వారికి ఈ నెలలో మొదటి రెండు వారాలు ప్రశాంతంగా గడిచిపోతాయి. ఉద్యోగ పరంగాను, ఆర్థికంగానూ నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొని ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు ఈ రాశి వారి ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఒక విధంగా అధికార యోగానికి అవకాశం ఉంటుంది. మిగిలిన రెండు వారాల్లో ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంటుంది కానీ, ఆర్థిక పరిస్థితి కొద్దిగా వెనుక పట్టు పడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కుటుంబ సభ్యులతో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. బంధువుల నుంచి ఆర్థిక విషయాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి సంబంధమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా కొద్దిగా శ్రమ ఉంటుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కోర్టు కేసు ఒకటి ఎక్కువ కాలం వాయిదా పడే అవకాశం ఉంది.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు