Vastu Tips: ఐశ్వర్యప్రాప్తి కోసం 6 మట్టి వస్తువులు.. ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం కావడం ఖాయం..!

|

Jun 10, 2023 | 4:45 PM

Vastu Tips: సనాతన హిందూ ధర్మంలో శ్రీమహాలక్ష్మిని సిరిసంపదలకు మూల దేవతగా భావిస్తారు. ఆర్థిక సమస్యలు లేకుండా ధనవంతులుగా ఎదగాలంటే లక్ష్మీకటాక్షం తప్పనిసరిగా ఉండాలనేది పెద్దల మాట. అయితే ఇంట్లో ధనం నిలవాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం..

Vastu Tips: ఐశ్వర్యప్రాప్తి కోసం 6 మట్టి వస్తువులు.. ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం కావడం ఖాయం..!
Vastu Tips
Follow us on

Vastu Tips: సనాతన హిందూ ధర్మంలో శ్రీమహాలక్ష్మిని సిరిసంపదలకు మూల దేవతగా భావిస్తారు. ఆర్థిక సమస్యలు లేకుండా ధనవంతులుగా ఎదగాలంటే లక్ష్మీకటాక్షం తప్పనిసరిగా ఉండాలనేది పెద్దల మాట. అయితే ఇంట్లో ధనం నిలవాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం, ఆ తల్లికి ఇష్టమైనవాటిని ఇంట్లో పెట్టుకోవడం చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో మట్టితో చేసిన కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవని, వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇల్లు ధనాన్ని ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో లక్ష్మీకటాక్షం కోసం సుఖసంతోషాలు, ఐశ్వర్యాలను పొందటానికి ఏయే వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మట్టి విగ్రహాలు: ఇంట్లో మట్టితో చేసిన దేవతా విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదిదేవుడైన గణపతి మట్టి విగ్రహం ఇంట్లో ఉండాలని, అలా చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మట్టి కుండ: పూజా సమయంలో మట్టి కుండలోని నీటిని ఉపయోగించడం శ్రేయస్కరమని ధర్మ గ్రంధాలలో చెప్పబడింది. మట్టి కుండలోని నీతిలో వెండినాణెం వేసి ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి, ఐశ్వర్య ప్రాప్తికి కారకంగా మారుతుందని పెద్దలు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

దీపపు కుందె: సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం శుభప్రదంగా హిందువులు భావిస్తారు. మట్టి దీపం పంచతత్వానికి చిహ్నం. అందువల్ల మట్టి దీపపు కుందె ఇంట్లో ఉండడం మంచిది. ఇంకా అది దాంపత్య జీవితంలో మధురత్వాన్ని కలిగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

మట్టి బొమ్మలు: ఇంట్లో మట్టి బొమ్మలు ఉండడం కూడా వాస్తు ప్రకారం తప్పనిసరి. మట్టి బొమ్మలు ఇంట్లో సానుకూలత, ప్రశాంతతను కలిగిస్తాయని పెద్దల నమ్మకం.

మొక్కల కుండీ: చాలా మంది తమ ఇంట్లో చెట్లు, మొక్కలను ఆకర్షణ కోసం సిరామిక్, ప్లాస్టిక్ కుండీలలో పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం మట్టి కుండీలలో నాటాలి. మట్టి కుండీలను వాడడం వల్ల ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..