Ekadashi 2024
కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఉత్థాన ఏకాదశి హిందూ మతంలో ముఖ్యమైన పండుగ. ఈ రోజున విష్ణువు నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ రోజున చేసే పూజలు, ఉపవాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయవద్దు. లేకపోతే జీవితంలో అనేక రకాల కష్టాలు ఏర్పడవచ్చు. ఉత్థాన ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున తులసి మొక్కను పూజించడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నియమాలను అనుసరిస్తూ విష్ణుమూర్తిని పూజించడం వల్ల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం.
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి 11 నవంబర్ 2024 సాయంత్రం 6.46 గంటలకు ప్రారంభమవుతుంది. ఏకాదశి తిధి నవంబర్ 12, 2024 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం దేవుత్తని ఏకాదశి ఉపవాసం నవంబర్ 12వ తేదీ మంగళవారం నాడు ఆచరించాల్సి ఉంటుంది.
ఉత్థాన ఏకాదశి రోజున పొరపాటున కూడా ఎవరైనా సరే కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులు చేయడం వల్ల జీవితంలో అనేక కష్టాలు.. ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కోల్పోతారు. కనుక ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తద్వారా జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు.
ఉత్థాన ఏకాదశి రోజున పొరపాటున కూడా పనులు చేయకండి
- ఆహార తినే విషయంలో జాగ్రత్త: ఉత్థాన ఏకాదశి రోజున విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం చేస్తారు. అందుచేత ఆహారం తీసుకోరాదు. పొరపాటున ఏమైనా తింటే ఉపవాస నియమాన్ని ఉల్లంగించినట్లే..
- మాంసం, మద్యం వినియోగం: మాంసం, మద్యంతో పాటు ఇతర తామసిక ఆహార పదార్థాల వినియోగం నిషేధించబడింది. ఉపవాసం ఉన్నా లేకుండా ఇలాంటివి తినడం పాప కర్మ అని నమ్మకం.
- అబద్ధం చెప్పడం: అబద్ధం చెప్పడం పాప కర్మ.. ఇలా అబద్దాలు చెప్పడం వలన భగవంతుడికి కోపం వస్తుంది. ఈ రోజు నిజం మాట్లాడటం చాలా ముఖ్యం. ఎవరికీ అబద్ధాలు చెప్పకండి.
- దొంగతనం: దొంగతనం పెద్ద పాపం. ఇది జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది.
- ఒకరిని బాధపెట్టడం: ఎవరినైనా బాధపెట్టడం వల్ల మనస్సు కలత చెందుతుంది. భగవంతుని అనుగ్రహాన్ని దూరం చేస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రేమతో, కరుణతో మెలగాలి.
- కోపం తెచ్చుకోవడం: కోపగించుకోవడం వల్ల మనసు కలత చెందుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ రోజు ప్రశాంతంగా ఉండి విష్ణువుని పూజించాలి.
- తప్పుడు ఆరోపణలు చేయడం: ఎవరి పైన అయినా తప్పుడు ఆరోపణలు చేయడం పెద్ద పాపం. ఇది వ్యక్తి గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలకు విఘాతం.
- పరుషంగా మాట్లాడం: ఎవరితోనైనా పరుషంగా మాట్లాడం వలన మనస్సు కలవరపెడుతుంది. బంధలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ రోజు ఎవరిని పరుషమైన పదాలతో నినదించ వద్దు.
- అనైతిక చర్యలు చేయడం: అనైతిక చర్యలు చేయడం పాపం .. జీవితంలో అనేక సమస్యలకు దారి తీస్తుంది.
- సోమరితనం: సోమరితనం అనేది జీవితంలో అతి పెద్ద చెడు అలవాటు. సోమరి తనం ఉన్నవారు జీవితంలో ఎన్నడూ విజయం సాధించలేడు. ఈ రోజున ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉండాలి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.