Ugadi 2022: ఈనెల 30 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..

|

Mar 16, 2022 | 7:13 AM

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం (Srisailam) లో ఇటీవల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు ఉగాది మహోత్సవాల (Ugadi Mahotsavam)కు సిద్ధమవుతోందీ పుణ్యక్షేత్రం.

Ugadi 2022: ఈనెల 30 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..
Follow us on

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం (Srisailam) లో ఇటీవల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు ఉగాది మహోత్సవాల (Ugadi Mahotsavam)కు సిద్ధమవుతోందీ పుణ్యక్షేత్రం. ఈనెల 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఉగాది మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది పండగను పురస్కరించుకుని మల్లన్న దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానంలో చేయాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టిసారించారు ఆలయాధికారులు. కాగా నల్లమల అడవుల మీదుగా పాదయాత్రగా వచ్చే భక్తులకు మంచినీరు, ఆహారం, వైద్యం తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఈ మేరకు కర్ణాటక, మహారాష్ట్ర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బీజాపూర్ లో సమన్వయ సమావేశం నిర్వహించామని పేరక్ఒన్నారు.

కాగా ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు మల్లన్న భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పించనున్నట్టు ఆలయాధికారులు తెలిపారు. అదేవిధంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు భక్తులందరికీ స్వామివార్ల అలంకార దర్శనం ఉంటుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం యథావిథిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Also Read: Gaddiannaram Market: గడ్డి అన్నారం మార్కెట్‌ తరలింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. వ్యాపారులు వెళ్లిపోవాలంటూ..

Pranitha Subhash: ఆ సినిమా చూశాక నేను, నా భర్త ఏడుస్తూ బయటకు వచ్చేశాం.. బాపు బొమ్మ ప్రణీత భావోద్వేగం..

Health News: ఉడికించిన గుడ్డు.. వేయించిన గుడ్డు.. ఏది ఆరోగ్యానికి మంచిది..!