Tulsi Vivah 2023: తులసి శాలిగ్రామ వివాహం ఎందుకు చేస్తారు..? తులసి లేని నైవేద్యం ఎందుకు స్వీకరించడంటే..

తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. శ్రీ మహా విష్ణువు తులసి లేని నైవేద్యాన్ని స్వీకరించడు. అయితే పురాణాల ప్రకారం తులసి .. విష్ణువు కంటే ముందు.. బృందగా రాక్షస వంశానికి చెందిన అసురుడిని వివాహం చేసుకుంది. అంతే కాదు బృంద కూడా రాక్షస వంశంలో పుట్టింది. అయితే రాక్షస వంశంలో పుట్టిన తులసి మహావిష్ణువుకి ఎందుకు చాలా ప్రీతిపాత్రమైనది? తులసి విష్ణువుకు మధ్య ఉన్న బంధం గురించి పురాణాల కథనం ఏమిటంటే.. 

Tulsi Vivah 2023: తులసి శాలిగ్రామ వివాహం ఎందుకు చేస్తారు..? తులసి లేని నైవేద్యం ఎందుకు స్వీకరించడంటే..
Tulsi Vivah 2023
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2023 | 9:33 PM

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకు తులసికి వివాహం అత్యంత వైభవంగా చేస్తారు హిందువులు. అయితే కొందరు సిల్క్ ద్వాదశి అంటూ కార్తీక ద్వాదశి రోజున కూడా తులసి వివాహాన్ని జరుపుతారు. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. శ్రీ మహా విష్ణువు తులసి లేని నైవేద్యాన్ని స్వీకరించడు. అయితే పురాణాల ప్రకారం తులసి .. విష్ణువు కంటే ముందు.. బృందగా రాక్షస వంశానికి చెందిన అసురుడిని వివాహం చేసుకుంది. అంతే కాదు బృంద కూడా రాక్షస వంశంలో పుట్టింది. అయితే రాక్షస వంశంలో పుట్టిన తులసి మహావిష్ణువుకి ఎందుకు చాలా ప్రీతిపాత్రమైనది? తులసి విష్ణువుకు మధ్య ఉన్న బంధం గురించి పురాణాల కథనం ఏమిటంటే..

తులసి పూర్వ జన్మలో బృంద అనే యువతి. రాక్షస వంశంలో జన్మించిందని నమ్ముతారు. అయినప్పటికీ బృంద చిన్నతనం నుంచి విష్ణు భక్తురాలు. ఆమె పెరిగి యుక్త వయసు వచ్చిన తర్వాత రాక్షస వంశానికి చెందిన రాక్షస రాజు జలంధరుని వివాహం చేసుకుంది. జలంధరుడనే రాక్షసుడు సముద్రం నుండి పుట్టాడు. వృందా చాలా సద్గుణాలు కలిగిన స్త్రీ. భర్తను దైవంగా భావించి పూజించేది.

ఒకసారి జలంధరుడు  నేపథ్యంలో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం మొదలైంది. అప్పుడు బృంద తన భర్త జలందరుడితో మీరు యుద్ధానికి వెళుతున్నారు.. యుద్ధంలో ఉన్నంత వరకు యుద్ధంలో మీరు విజయం సాధించాలని కోరుతూ పూజ చేస్తాను అని చెప్పింది. యుద్ధం నుంచి తన భర్త తిరిగి వచ్చేటంత వరకూ పూజ  సంకల్పాన్ని విడవనని తెలిపింది. భార్య బృందం చెప్పిన తర్వాత జలంధరుడు యుద్ధానికి వెళ్ళాడు.   బృందా ఉపవాస దీక్ష చేపట్టి పూజ చేయడం మొదలు పెట్టింది. బృంద పూజ ప్రభావం వల్ల దేవతలు కూడా జలంధరుని ఓడించలేకపోయారు. దేవతలు ఓడిపోవడం ప్రారంభించిన తరువాత దేవతలందరూ కలిసి  విష్ణువు వద్దకు వచ్చారు. తమను ఈ ప్రమాదం నుంచి కాపాడమంటూ ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి

తులసి సంకల్పాన్ని విష్ణువు ఎలా ఛేదించాడంటే

బృందా  గొప్ప భక్తురాలు.. తాను ఆమెను మోసం చేయలేను అని విష్ణువు సమాధానమిచ్చాడు. అయినపప్పటికీ తమ గెలుపు కోసం పరిష్కారం దయచేసి చెప్పామని విష్ణువుని వేడుకున్నారు. దీంతో  శ్రీ మహా విష్ణువు జలంధరుడి రూపాన్ని ధరించి బృంద ఉన్న రాజభవనానికి చేరుకున్నాడు. వృంద తన భర్తను చూడగానే .. వెంటనే పూజ చేయడం విరమించి భర్త పాదాలను తాకింది. దీంతో బృంద సంకల్పం భగ్నమైంది.. యుద్ధంలో దేవతలు జలంధరుని చంపి తల నరికారు.  తెగిన జలంధరుని శిరస్సు రాజభవనంలో బృంద ఉన్న చోట పడింది. దీంతో బృంద జలంధరుని రూపం దాల్చిన స్వామిని ఆశ్చర్యంగా చూసింది.

విష్ణువుని శపించిన బృంద

శ్రీ మహావిష్ణువు తన భక్తురాలైన బృందంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. బృందానికి కోపం వచ్చి విష్ణువు  రాయిగా మార్చమని శపించింది. దీంతో విష్ణువు వెంటనే రాయిగా మారిపోయాడు. దేవుళ్లందరిలో అలజడి రేగింది. దేవతలు అందరూ బృందను ప్రార్థించిన తరువాత, బృందా తన శాపాన్ని వెనక్కి తీసుకుంది. దీని తర్వాత  బృంద తన భర్త శిరస్సుతో కలిసి సతీసగమనం చేసింది. బృంద బూడిద నుండి ఒక మొక్క ఉద్భవించింది. అప్పుడు విష్ణువు ఆ మొక్కకు తులసి అని పేరు పెట్టాడు. తాను రాతి రూపంలో శాలిగ్రామం పేరుతో ఉంటానని.. శాలిగ్రామం పేరుతో తులసితో పాటు పూజించబడతానని వరం ఇచ్చాడు బృందకు.

అంతే కాదు తులసి లేని ఏ నైవేద్యాన్ని తాను స్వీకరించనని విష్ణువు చెప్పాడు. అప్పటి నుండి తులసిని పూజించడం ప్రారంభించారు. కార్తీక మాసంలో తులసిమాతకు శాలిగ్రామానికి వివాహం చేస్తారు. అలాగే దేవ  ఉథాని ఏకాదశి రోజున తులసి వివాహాన్ని చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?