Karthika Pournami: ఈ ఏడాది కార్తీక పూర్ణిమ శుభ సమయం ఎప్పుడంటే, స్నానం ప్రాముఖ్యతను తెలుసుకోండి

కార్తీక మాసం శివ కేశువులను పూజించడానికి ఉత్తమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నదిలో చేసే స్నానం, దీపారాధన, దానం అత్యంత విశిష్టమని.. యాగం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ 27 నవంబర్ 2023 సోమవారం నాడు వచ్చింది. కార్తీక పూర్ణిమ రోజున ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని, దాన ధర్మాలు చేయడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయని.. అన్నింటా అదృష్టం కలుగుస్తుందని విశ్వాసం.

Karthika Pournami: ఈ ఏడాది కార్తీక పూర్ణిమ శుభ సమయం ఎప్పుడంటే, స్నానం ప్రాముఖ్యతను తెలుసుకోండి
Karthika Pournami
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2023 | 3:24 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు ఒక పూర్ణమి, అమావాస్య ఉంటుంది. ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది కనుక ఏడాదికి 12 పున్నమిలు లేదా 13 పున్నమిలు ఉంటాయి. సనాతన ధర్మంలో నెలలో వచ్చే ప్రతి పౌర్ణమి ముఖ్యమైనది. ఒకొక్క పౌర్ణమికి ఒకొక్క పేరు ఉంటుంది. అయినప్పటికీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు మరీ ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కార్తీక మాసం శివ కేశువులను పూజించడానికి ఉత్తమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నదిలో చేసే స్నానం, దీపారాధన, దానం అత్యంత విశిష్టమని.. యాగం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ 27 నవంబర్ 2023 సోమవారం నాడు వచ్చింది.

కార్తీక పూర్ణిమ రోజున ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని, దాన ధర్మాలు చేయడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయని.. అన్నింటా అదృష్టం కలుగుస్తుందని విశ్వాసం. కార్తీక పున్నమి రోజు శుభ సమయం, ఉపవాసం, పూజా విధానాన్ని తెలుసుకుందాం..

కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారంటే..

పురాణాల ప్రకారం కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అనంతరం తారకాసురుడు  ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి లను త్రిపురాసురులు అంటారు. వీరు బ్రహ్మ దేవుడుకోసం తపస్సు చేసి ఒక నగరం నిర్మించి ఇవ్వమని వరం కోరారు. అంతరిక్షంలో తిరుగుతూ వేయి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు.. అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారివల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు. ఈ వరం పొందిన తరువాత త్రిపురాసులు మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్తీక పున్నమి రోజున  శివుడు ఒకే బాణంతో ముగ్గురు రాక్షసులను సంహరించాడు. ఆ తర్వాత శివుడిని త్రిపురగా పిలవడం ప్రారంభించారు. కార్తీక పూర్ణిమ రోజును త్రిపురాశులను సంహరించాడు కనుక ఈ పున్నమిని త్రిపురపూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున దేవ్ దీపావళిని కూడా జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

కార్తీక పూర్ణిమ 2023 శుభ సమయం

కార్తీక మాసం పౌర్ణమి తేదీ నవంబర్ 26, 2023 ఆదివారం మధ్యాహ్నం 03:53 గంటలకు ప్రారంభమై నవంబర్ 27, 2023 సోమవారం మధ్యాహ్నం 02:45 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, 27 నవంబర్ 2023 సోమవారం నాడు పూర్ణిమ ఉపవాసం, స్నానం ఆచరిస్తారు.

కార్తీక పూర్ణిమ వ్రత, పూజా విధానం

ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయండి లేదా గంగాజలం కలిపిన నీటితో ఇంట్లో స్నానం చేయవచ్చు. అనంతరం లక్ష్మీ దేవి, శ్రీమహావిష్ణువు, శివుడి ముందు నెయ్యితో దీపం వెలిగించి, పూజలు, పండ్లు, పువ్వులు, నైవేద్యాలు, ధూప నైవేద్యంతో హారతి ఇవ్వండి. రాత్రి చంద్రోదయం తర్వాత పచ్చి పాలను నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. విష్ణువును పూజించిన తర్వాత చలిమిడి, వడపప్పు సహా పంచామృతాన్ని ప్రసాదంగా సమర్పించి ఉపవాసం విరమించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?