Tirumala: తిరుమలలో శ్రావణ శోభ.. ఆగష్టు నెలలో జరగనున్న విశేష ఉత్సవాలు ఏమిటంటే

| Edited By: Anil kumar poka

Jul 29, 2024 | 8:10 AM

శ్రావణ మాసం రానున్న నేపధ్యంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో జరగనున్న పండగులు, విశేష ఉత్సవాల గురించి టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలో శ్రీవారికి నిర్వహించబోయే పండుగలు, విశేష ఉత్సవాల గురించి పూర్తి వివరాలను వెల్లడించారు. దీంతో ఆగష్టు నెల మొత్తం తిరుమలలో శ్రావణ శోభను సంతరించుకోనుంది. పలు పర్వదినాల జరగనున్న సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరగనున్నట్లు టీటీడీ అధికారులు అంచనాలు వేస్తున్నారు.

Tirumala: తిరుమలలో శ్రావణ శోభ.. ఆగష్టు నెలలో జరగనున్న విశేష ఉత్సవాలు ఏమిటంటే
Tirumala Rush
Follow us on

తెలుగు సంవత్సరంలో ఐదవ నెల శ్రావణ మాసం.. వచ్చిందంటే చాలు పండగలు, పర్వదినలతో సందడి నెలకొంటుంది. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన నెలని శ్రావణ మాసం అని అంటారు. ఆధ్యాత్మికతో పాటు శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలమైన నెలగా భావిస్తారు. ఆలయాలు, పుణ్యక్షేత్రాల సందర్శనానికి భక్తులు ఆసక్తిని చూపిస్తారు. శ్రావణ మాసం రానున్న నేపధ్యంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో జరగనున్న పండగులు, విశేష ఉత్సవాల గురించి టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలో శ్రీవారికి నిర్వహించబోయే పండుగలు, విశేష ఉత్సవాల గురించి పూర్తి వివరాలను వెల్లడించారు. దీంతో ఆగష్టు నెల మొత్తం తిరుమలలో శ్రావణ శోభను సంతరించుకోనుంది. పలు పర్వదినాల జరగనున్న సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరగనున్నట్లు టీటీడీ అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమలలో ఆగస్టునెలలో జరిగే విశేష ఉత్సవాలు

  1. ఆగష్టు నెల 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం జరగనుంది.
  2. ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు చేస్తారు.
  3. ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ జరగనుంది.
  4. ఆగస్టు 10న కల్కి జయంతి, ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి జరగనుంది.
  5. ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా
  6. ఆగస్టు 15న భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం, స్మార్త ఏకాదశి జరగనుంది.
  7. ఆగస్టు 15 నుంచి 17 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
  8. ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం, నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం నిర్వహించనున్నది.
  9. ఆగస్టు 19న శ్రావణపౌర్ణమి రోజున పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనుంది. అదే రోజు రాఖీ పండుగ హయగ్రీవ జయంతి, విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి నిర్వహించనుంది.
  10. ఆగస్టు 20న తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు చేయనున్న టిటిడి గాయత్రీ జపం నిర్వహించనుంది.
  11. ఆగ‌స్టు 27న శ్రీ‌కృష్ణాష్ట‌మి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆస్థానం జరగనుంది.
  12. ఆగ‌స్టు 28న శ్రీ‌వారి శిక్యోత్స‌వాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది.
  13. ఆగ‌స్టు 28వ తేదీన శ్రీ‌వారి శిక్యోత్స‌వంతో ఈ నెలవారీ వేడుకలు ముగుస్తాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు