TTD News: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడు రూ. 300ల ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల..

|

Mar 22, 2022 | 6:53 AM

TTD News: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ శుభవార్త తెలిపింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా (Corona) దర్శనాల విషయంలో ఆంక్షలు విధిస్తూ వచ్చిన టీటీడీ తాజాగా పరిస్థితులు మెరుగుపడడంతో టికెట్ల కోటాను పెంచుతోంది...

TTD News: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడు రూ. 300ల ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల..
Follow us on

TTD News: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ శుభవార్త తెలిపింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా (Corona) దర్శనాల విషయంలో ఆంక్షలు విధిస్తూ వచ్చిన టీటీడీ తాజాగా పరిస్థితులు మెరుగుపడడంతో టికెట్ల కోటాను పెంచుతోంది. మొన్నటి వరకు తక్కువ సంఖ్యలో టికెట్లను విడుదల చేస్తూ వచ్చిన అధికారులు ఇప్పుడు భారీగా టికెట్లను కేటాయిస్తారు. ఈ క్రమంలోనే సోమవారం ఏప్రిల్‌ నెల కోటాకు సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసిన టీటీడీ, నేడు మే నెల కోటాను విడుదల చేయనుంది.

ఉదయం 9 గంటలకు టీటీడీ టికెట్లను విడుదల చేయనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30 వేల టికెట్లు, గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకు 25 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక రేపు (బుధవారం) జూన్ నెల కోటా టికెట్లు విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆర్జిత సేవల లక్కీ డిప్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..

శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.63 కోట్లు సమకూరింది. ఆదివారం వెంకటేశ్వర స్వామిని 70,408 మంది దర్శించుకోగా 34,932 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

Also Read: IPL 2022: మళ్లీ వైరల్ అవుతున్న ఐపీఎల్‌-6 సంఘటన.. లేడీ యాంకర్‌ని చంకనెత్తుకున్న కామెంటర్..!

Russia – Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో అమెరికా ఎంటరవుతుందా? ఆ ప్రకటన దేనికి సంకేతం..!

Russia – Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో అమెరికా ఎంటరవుతుందా? ఆ ప్రకటన దేనికి సంకేతం..!